Homeటాప్ స్టోరీస్Anirudh Ravichander: పెళ్లితో శుభం కార్డు.. అనిరుధ్, కావ్య లవ్ స్టోరీ చాలా పెద్దదే..

Anirudh Ravichander: పెళ్లితో శుభం కార్డు.. అనిరుధ్, కావ్య లవ్ స్టోరీ చాలా పెద్దదే..

Anirudh Ravichander: చాలా సీక్రెట్ గా ఉంచారు. మీడియా కంట పడలేదు. మీడియా ఊహగానానికి పరిమితమైంది కానీ.. కచ్చితంగా వారిద్దరి మధ్య ప్రేమ ఉందని రాయలేకపోయింది. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను కనీసం ప్రచురించలేకపోయింది. జ్యోనిత గాంధీ.. ఆండ్రియా వంటి పేర్లను కొన్ని మీడియా సంస్థలు అనిరుధ్ కు అంటగట్టి రాశాయి గాని.. అందులో వాస్తవం కంటే ఊహాగానమే ఎక్కువగా ఉంది. ఈ ఊహ గానాల మీద రాక్ స్టార్ ఎన్నడూ స్పందించలేదు. ఇక హైదరాబాద్ జట్టు […]

Anirudh Ravichander: చాలా సీక్రెట్ గా ఉంచారు. మీడియా కంట పడలేదు. మీడియా ఊహగానానికి పరిమితమైంది కానీ.. కచ్చితంగా వారిద్దరి మధ్య ప్రేమ ఉందని రాయలేకపోయింది. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను కనీసం ప్రచురించలేకపోయింది. జ్యోనిత గాంధీ.. ఆండ్రియా వంటి పేర్లను కొన్ని మీడియా సంస్థలు అనిరుధ్ కు అంటగట్టి రాశాయి గాని.. అందులో వాస్తవం కంటే ఊహాగానమే ఎక్కువగా ఉంది. ఈ ఊహ గానాల మీద రాక్ స్టార్ ఎన్నడూ స్పందించలేదు.

ఇక హైదరాబాద్ జట్టు కో ఓనర్ కావ్య ఎప్పుడూ ఒక ఇంట్రా వర్ట్ లాగానే కనిపించేది. కనీసం, తన హావభావాలను బయటికి ప్రదర్శించలేకపోయేది. కేవలం హైదరాబాద్ జట్టు మ్యాచులు ఆడుతున్నప్పుడు మాత్రమే ఆమె బయటకు వచ్చేది. మైదానంలో సందడి చేసి వెళ్లిపోయేది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకునేది. అందువల్లే ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వేలకోట్ల సామ్రాజ్యానికి ఒక్కతే వారసురాలు. దీంతో ఈమె గురించి మీడియాలో రకరకాల కథనాలు వచ్చేవి. ఎవరో ఆ అదృష్టవంతుడు అని రకరకాల చర్చలు జరిగేవి. కానీ చివరికి ఆ అదృష్టాన్ని అనిరుధ్ దక్కించుకున్నాడు.

వీళ్ళ పెళ్లి గురించి.. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ బయటపెట్టే వరకు బయటకు తెలియదు. ఆయన కూడా చెప్పలేదు. కాకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెడ్డింగ్ కార్డు ఇచ్చిన ఫోటోను తెలంగాణ సీఎంవో సోషల్ మీడియా ద్వారా బయట పెట్టడంతో అందరికీ తెలిసింది. అప్పటిదాకా వీరిద్దరి ప్రేమ గురించి.. పెళ్లి గురించి బయటకి తెలియలేదంటే ఏ స్థాయిలో రహస్యాన్ని కొనసాగించారో అర్థం చేసుకోవచ్చు.

సన్ పిక్చర్స్ నిర్మించే చిత్రాలకు అనిరుద్ ఒక రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడు. ముఖ్యంగా జైలర్ సినిమాకి ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చాడు. హుకుం పాటకైతే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు. అప్పట్లో జైలర్ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు ఈ పాట ను అనిరుద్ పాడాడు. దానికి కావ్య ఎగిరి గంతులు వేసింది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ మొగ్గ తొడిగిందని తెలుస్తోంది. వాస్తవానికి మొదట్లో వీరిద్దరి మధ్య స్నేహం కూడా అంతగా ఉండేది కాదు. జరిగిన పరిణామాలు.. సన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రాలకు అనిరుద్ అద్భుతంగా సంగీతం అందించడం.. వంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో కావ్య మనసు పూర్తిగా మారిపోయింది. దీనికి తోడు అనిరుద్ కూడా ఆమెకు పడిపోయాడు. అనంతరం వీరిద్దరి ప్రేమ పట్టాలెక్కింది. అది పెద్దలకు తెలిసింది. ఆ తర్వాత పెళ్లికి ఒకే చెప్పడం జరిగిపోయింది.

వీళ్ళ లవ్ స్టోరీ సాలిడ్.. ఎందుకంటే మీడియా కంటపడకుండా.. ఎటువంటి లీకులు ఇవ్వకుండా.. నేటి సోషల్ మీడియా కాలంలో ఇంతటి సిక్రసి కొనసాగించారు అంటే మామూలు విషయం కాదు. నవంబర్ 11.. 11వ తేదీన గ్రీస్ ప్రాంతంలో రజనీకాంత్ దంపతులు.. స్టాలిన్ దంపతులు.. కళానిధి మారన్ దంపతులు.. అనిరుద్ రవిచంద్రన్ తల్లిదండ్రుల సమక్షంలో రాక్ స్టార్.. కావ్య వివాహం జరిగింది. ఈ ఫోటోలను అనిరుద్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. జీవితాంతం ఇది గుర్తుండిపోతుందని రాసుకొచ్చాడు. మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త.. ఫ్యామిలీ మెన్ అయిపోయాడు.

 

View this post on Instagram

 

A post shared by Anirudh (@anirudhofficial)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper