Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda-Gautam Tinnanuri : మరో కాన్సెప్ట్ మూవీ.. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సంచలన ప్రయోగం..

Vijay Devarakonda-Gautam Tinnanuri : మరో కాన్సెప్ట్ మూవీ.. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సంచలన ప్రయోగం..

Vijay Devarakonda-Gautam Tinnanuri : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ చేతులు కలిపాయి. యువ సంచలనం విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ కాన్సెప్ట్ మూవీ మేకర్ అయిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనుంది. విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, పెళ్లి చూపులు వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకొని విజయ్ దేవరకొండ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంతో ఆయనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తానని దర్శకుడు అంటున్నారు. ఎందరో నటీనటులతో పనిచేస్తూ ఎన్నో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మొదటిసారి విజయ్‌తో జత కట్టడంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘జెర్సీ’ చిత్రం కోసం జతకట్టారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. తెలుగు, హిందీ పరిశ్రమలలో ప్రతిభగల దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి నిరూపించుకున్నారు. 2019లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఎంతో ప్రతిభగల గౌతమ్ ఇప్పుడు మరో ప్రతిభావంతుడు, యువ సంచలనం విజయ్ దేవరకొండతో చేతులు కలిపారు. వీరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ అంచనాలను అధిగమించి, అందరినీ అలరించే చిత్రం అందిస్తామని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఇది భూమి బద్దలై పోయేది, అత్యంత భారీగా ఉంటుందని తాము చెప్పట్లేదు.. కానీ అద్భుతమైన విషయం అని మాత్రం చెప్పగలమని నిర్మాత నాగవంశీ అన్నారు.

చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారిని తలపిస్తున్నాడు. పోస్టర్ మీద “I don’t know where I belong, to tell you whom I betrayed – Anonymous Spy” అని రాసుండటం గమనించవచ్చు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు.

ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

https://twitter.com/SitharaEnts/status/1613893914062385152?s=20&t=2NDo91SKgMYjkl3WnIbKkg

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
Oktelugu Epaper