spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda : ఆ కన్నడ బ్యూటీతో హాట్ రొమాన్స్ చేసిన విజయ్ దేవరకొండ.. నెక్స్ట్...

Vijay Devarakonda : ఆ కన్నడ బ్యూటీతో హాట్ రొమాన్స్ చేసిన విజయ్ దేవరకొండ.. నెక్స్ట్ లెవెల్ అంటా

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో కొన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా పేరు సంపాదించలేదు. గుర్తింపు కూడా రాలేదు. అయితే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో ఏకంగా స్టార్ హీరోగా పేరు సంపాదించారు. సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నా కూడా యూత్ కు చాలా కనెక్ట్ అయింది ఈ సినిమా. తనదైన శైలితో ఒక్కసారిగా ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సంపాదించారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ హీరోగా ఎదిగినా అంతకు ముందు మాత్రం చాలా కష్టపడ్డారు విజయ్ దేవరకొండ. ఇక ఈ హీరోకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. అయినా సరే హీరోగా ప్రయాణాన్ని మొదలు పెట్టి.. తన స్టైల్ తో ఆరంభంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకొనిపోతున్నాడు రౌడీ భాయ్. అంత బాగున్నా ప్రస్తుతం విజయ్ ఫేత్ బాగాలేనట్టు ఉంది. అందుకే ఈ మధ్య సరైన సక్సెస్‌లను సొంతం చేసుకోలేక పోతున్నాడు విజయ్. ఇక ప్రస్తుతం మరో సినిమాతో రాబోతున్నాడు మీ రౌడీ భాయ్. మరి ఆ సినిమా గురించి కొన్ని వివరాలు మీకోసం..

చాలా కాలంగా విజయాన్ని అందుకోలేక సతమతం అవుతున్నాడు విజయ్ దేవరకొండ. గతంలో అన్ని ఫ్లాప్ లను చవిచూశాడు. కానీ ఖుషీ సినిమాతో మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కూడా మంచి హిట్ లు పడతాయి అనుకుంటే ఫ్యామిలీ స్టార్ సినిమా నిరాశ పరిచింది. అందుకే ఈ సారి సక్సెస్ సాధించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో విజ్జు ఫ్యూచర్ ప్రాజెక్టులమీద ఫోకస్ పెట్టారట. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూట్‌లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన చాలా సన్నివేశాలు పూర్తి అయ్యాయి. గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తుండగానే విజయ్ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. దీన్ని ‘రాజా వారు రాణి గారు’ సినిమా ఫేం రవి కిరణ్ కోలా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.

విజయ్ దేవరకొండ – రవి కిరణ్ కోలా కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, ఈ మూవీ షూట్‌కు చాలా సమయం ఉండడంతో ఇప్పుడు నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టారు. ఇలా తాజాగా హీరోయిన్‌ న్యూస్ లీకైంది.

విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా రూపొందించే ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్‌ హీరోయిన్ గా ఎంపిక అయిందట. వాస్తవానికి ఈ చిత్రంలో సాయి పల్లవి విజయ్ దేవరకొండతో నటించబోతుందనే టాక్ వచ్చింది. కానీ, ఆమెను కాదని రుక్మిణిని తీసుకుంటున్నారట. మరి సాయి పల్లవి రిజక్ట్ చేసిం

దా? లేదా మేకర్స్ రిజక్ట్ చేశారా తెలియదు. కానీ ఈ కన్నడ భామ గురించి తెలియగానే సాయి పల్లవి అభిమానులు హట్ అయితే కొత్త హీరోయిన్ అందాలను చూసి కొందరు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా ఊపందుకుంది. ఇది పూర్తైన వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభం చేస్తారు. ఇందులో నటించే నటీనటులు, పని చేసే టెక్నీషియన్ల వివరాలు కూడా త్వరలోనే తెలియజేస్తారట.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper