spot_img
Homeఎంటర్టైన్మెంట్Varanasi Nizam Theatrical Rights: ఒక్క నైజాం ప్రాంతం లోనే 175 కోట్లు..ఏడాదికి ముందే రికార్డుల...

Varanasi Nizam Theatrical Rights: ఒక్క నైజాం ప్రాంతం లోనే 175 కోట్లు..ఏడాదికి ముందే రికార్డుల వేట మొదలుపెట్టిన ‘వారణాసి’

Varanasi Nizam Theatrical Rights: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం, వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు ఇంకా 15 నెలల సమయం ఉంది. అయినప్పటికీ ఈ చిత్రం ఇప్పటి నుండే రికార్డ్స్ ని క్రియేట్ చేయడం మొదలు పెట్టింది. రీసెంట్ గానీ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ కోసం ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థ మూవీ టీం ని సంప్రదించి 650 కోట్ల రూపాయిల ఆఫర్ ని ఇవ్వడం, నిర్మాతలు అంతకన్నా ఎక్కువ డబ్బులు ఆశించారు అనే వార్తలు రావడం మనమంతా విన్నాం. కానీ చివరికి 650 కోట్ల రూపాయలకే డీల్ ముగిసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తూర్పు గోదావరి ప్రాంతానికి చెందిన ఒక టాప్ డిస్ట్రిబ్యూటర్, మేకర్స్ కి 18 కోట్ల రూపాయిల ఆఫర్ ఇచ్చాడని, కానీ మేకర్స్ 20 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా నైజాం రైట్స్ కోసం టాలీవుడ్ కి చెందిన ఇద్దరు బడా నిర్మాతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఒక నిర్మాత 150 కోట్ల రూపాయిల ఆఫర్ ఇచ్చాడట, మరో నిర్మాత అయితే ఏకంగా 175 కోట్ల రూపాయిల ఆఫర్ ఇచ్చాడట. ఈ ఇద్దరు నిర్మాతలు ఎవరో మీ అందరికీ తెలిసిందే. ఒకరు దిల్ రాజు, మరొకరు మైత్రి మూవీ మేకర్స్ నవీన్. వీళ్లిద్దరి సంగతి పక్కన పెడితే, నైజం డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ లోకి అక్కినేని నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియోస్’ కూడా రీసెంట్ గానే ఎంట్రీ ఇచ్చింది. త్వరలో విడుదల అవ్వబోతున్న కొన్ని క్రేజ్ మూవీస్ కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ‘అన్నపూర్ణ స్టూడియోస్ ‘ సంస్థ, ‘వారణాసి’ నైజాం రైట్స్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుందట.

ఈ ముగ్గురిలో ఎవరికీ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దక్కబోతుందో చూడాలి. ముగ్గురుకి కూడా నిర్మాతలు అడిగినంత డబ్బులు ఇచ్చే సత్తా ఉంది. కానీ నైజాం ప్రాంతం లో 175 కోట్ల రూపాయిలు పెట్టి ఒక సినిమాని కొనుగోలు చేస్తే బూడిద తప్ప ఏమి మిగలదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఒక్కప్పటి లాగా ఇప్పుడు ఈ ప్రాంతం లో టికెట్ హైక్స్, ప్రీమియర్ షోస్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. హై కోర్టు ఈ వ్యవహారం లో చాలా సీరియస్ గా ఉంది. ఒకవేళ టికెట్ హైక్స్ ఇచ్చినా కూడా 175 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడం అసాధ్యమని అంటున్నారు విశ్లేషకులు, చూడాలి మరి ఇంతకు తెగుతుందో అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper