Varanasi: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి దర్శకుడు మరొకరు ఉండరనేది వాస్తవం… మొదట టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక అలజడిని క్రియేట్ చేశాడు. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లను సైతం పక్కకు నడుతూ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు సౌత్ సినిమాలను పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మన సినిమాలకి అక్కడ డిమాండ్ అయితే ఎక్కువగా పెరిగింది. మన దర్శకులతో సినిమాలు చేయడానికి అక్కడ టాప్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారంటే మన వాళ్ళు ఏ రేంజ్ కి వెళ్లారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్ర చాలా స్పెషల్ గా నిలువబోతుందట. మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రాముడికి కుంభకర్ణుడికి పెద్ద యుద్దమైతే జరగబోతుందట. ఇంతకీ కుంభకర్ణుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న… నిజానికి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినప్పటికి కుంభకర్ణుడి పాత్ర ఎవరు చేస్తున్నారనే విషయంలో ఇంతవరకు ఒక్క లీక్ కూడా రాలేదు. కానీ ప్రస్తుతం సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారమైతే ఆ క్యారెక్టర్ కోసం ఒక హాలీవుడ్ నటుడిని తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కారణం ఏంటంటే కుంభకర్ణుడు అంటే చాలా లావుగా చాలా ఎత్తుగా ఉండాలి. కాబట్టి అలాంటి ఒక భారీ ఆకారం ఉన్న నటుడిని హాలీవుడ్ నుంచి తీసుకువస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. హాలీవుడ్ నటుడిని పెడితే అక్కడి మార్కెట్ కూడా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతోనే అతన్ని సెలెక్ట్ చేసుకున్నారట.
లేకపోతే తెలుగు నటుడునే తీసుకునేవారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా కుంభకర్ణుడి పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటే రాముడు గెటప్ లో మహేష్ బాబు చేసే యుద్ధం అంత బాగా ఎలివేట్ అవుతుంది. రాజమౌళి ఎలివేషన్ సన్నివేశాలను చిత్రీకరించడంలో దిట్ట…
కాబట్టి అతనికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. ఇక కుంభకర్ణుడి పాత్రను పోషిస్తున్న నటుడు ఎవరు అనేది తెలియాలంటే సినిమా యూనిట్ ఈ విషయం మీద స్పందించాలి… లేదంటే సినిమా టీజర్ గాని, ట్రైలర్ గానీ వస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశమైతే లేదు…