Jagan: రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని తమిళ హీరోలు సూర్య, కార్తీ కి మన మాజీ సీఎం జగన్ ని కలిసేంత అవసరం ఏమొచ్చింది?, వీళ్ళు ఏమైనా వైసీపీ పార్టీ ని అభామినిస్తున్నారా?, లేదా ఆ పార్టీ లో చేరాలని చూస్తున్నారా?, అసలు ఇప్పుడు జగన్ తో వాళ్లకు ఉన్న పనేంటి, అధికారం లో కూడా లేడు కదా?, ఇలా ఎన్నో ఆలోచనలు పైన హెడ్ లైన్ చూడగానే మీ అందరిలో కలిగే ఉంటాయి. కానీ వీళ్లిద్దరు జగన్ ని ప్రత్యేకించి ఏమి కలవలేదు, ఒక పెళ్లి ఫంక్షన్ లో జగన్ కనిపించినప్పుడు ఆయన్ని కౌగలించుకున్నారు, కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. అంతకు మించి ఎలాంటి రాజకీయ కోణంతో ఈ అంశాన్ని చూడాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాల్లోకి చెన్నై లో జగన్ ఆప్త మిత్రుడు సునీల్ రెడ్డి పెళ్లి నేడు జరిగింది.
ఈ పెళ్ళికి జగన్ తో పాటు పలువురు కోలీవుడ్ టాప్ హీరోలు కూడా హాజరయ్యారు. వారిలో సూర్య, కార్తీ కూడా ఒకరు. వీళ్లిద్దరు జగన్ ని కలిసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే, ఈమధ్య కాలంలో ఈయన చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఎన్నో అంచనాల నడుమ గత ఏడాది విడుదలైన ‘రెట్రో’ కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన డైరెక్ట్ గా తెలుగు చిత్రం చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల కానుంది.
ఇక ఆయన సోదరుడు హీరో కార్తీ విషయానికి వస్తే రీసెంట్ గానే ఈయన సంక్రాంతికి ‘వా..వాతియార్’ అనే చిత్రాన్ని విడుదల చేశాడు. ఈ సినెమా కమర్షియల్ గా దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. రీసెంట్ గానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. తెలుగులో ‘అన్నగారు వస్తున్నారు’ పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి మిశ్రమ స్పందనే లభించింది. ఇప్పుడు ఆయన నుండి ‘సర్దార్ 2’ విడుదల కాబోతుంది. ‘ఖైదీ 2’ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు కానీ, ఇప్పట్లో ఈ సినిమా వచ్చే సూచనలు కనిపించడం లేదు.
చెన్నైలో వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహంలో మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసి పలకరించిన తమిళ హీరోలు సూర్య_ కార్తీ…#YSjagan #Suriya #karthi pic.twitter.com/7qK14CAPC2
— Rajesh Manne (@rajeshmanne1) February 8, 2026
