Homeఎంటర్టైన్మెంట్చరణ్ తో వంశీ పాన్ ఇండియా సినిమా !

చరణ్ తో వంశీ పాన్ ఇండియా సినిమా !

సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత కూడా, పాపం ఛాన్స్ కోసం స్టార్ హీరోల చుట్టూ అలిసిపోయేలా తిరిగాడు ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. హిట్స్ కొట్టిన స్టార్ డైరెక్టర్ గా వంశీ పైడిపల్లికి నేమ్ ఉన్నా.. ఎందుకో సినిమా అంత త్వరగా సెట్ అవ్వలేదు. అందరి స్టార్ హీరోలు ఇప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో, మొతానికి వంశీకి అసలు టైం కలిసిరాలేదు. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో […]


సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత కూడా, పాపం ఛాన్స్ కోసం స్టార్ హీరోల చుట్టూ అలిసిపోయేలా తిరిగాడు ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. హిట్స్ కొట్టిన స్టార్ డైరెక్టర్ గా వంశీ పైడిపల్లికి నేమ్ ఉన్నా.. ఎందుకో సినిమా అంత త్వరగా సెట్ అవ్వలేదు. అందరి స్టార్ హీరోలు ఇప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో, మొతానికి వంశీకి అసలు టైం కలిసిరాలేదు. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా.. మహేష్ తో వంశీకి మంచి సాన్నిత్యం ఉన్నా.. మహేష్ మాత్రం వంశీకి సినిమా ఇవ్వలేదు. పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చకపోవడం అందుకు కారణం అని బయటకు వచ్చిన వార్త.

Also Read: డ్రగ్స్ కేసులో రకుల్ నలుగురు స్టార్ల పేర్లు బయటపెట్టిందా?

దాంతో మహేష్, వంశీ సినిమాని పక్కన పెట్టేశారు. ఈ లోపు మహేష్ పరుశురాం కథకు ఫిక్స్ ఆయిపోయాడు. ఇక చేసేదేం లేక వంశీ మిగిలిన స్టార్ హీరోల చుట్టూ కథ పట్టుకుని తిరిగి మొత్తానికి రామ్ చరణ్ ను ఒప్పించాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన తరువాత సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లితోనే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. వంశీ చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందట. అన్నట్టు ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో వంశీ పైడిపల్లి సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Also Read: తన సమాధిపై ఏం రాయలో బాలు ముందే చెప్పారట!

ఎలాగూ వంశీ, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి కాబట్టి ఈ సినిమాని పాన్ ఇండియా సినిమా మలచాలనే ఆలోచన కూడా ఉందట. పైగా వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించడంతో పాటు హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా మంచి హిట్ అయింది. దాంతో హిందీ ప్రేక్షకుల్లో కూడా వంశీ, చరణ్ తో చేయబోయే సినిమా పై భారీ ఎక్స్ పెటేషన్స్ పెట్టుకుంటారు. అయితే చరణ్ తో సినిమా అంటే.. వంశీ మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఈ లోపు వంశీ స్క్రిప్ట్ వర్క్ మీదే కూర్చుంటాడట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper