‘ఉప్పెన’ సినిమాతో స్టార్ అయిపోయాడు మెగా మేనల్లుడు ‘వైషవ్ తేజ్’. ఇప్పుడు నిర్మాతలు ఈ హీరో డేట్లు కోసం ఎదురుచూస్తున్నారు. ‘వైషవ్ తేజ్’ కూడా గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటూ కొత్త సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్తున్నాడు. తాజాగా ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలు అయింది.
‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ ను తెరకెక్కించిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు, అయితే, ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ ను గిరీశాయ బాగా తీయలేదని.. అతని డైరెక్షన్ బాగా లేక పోవడం వల్లే.. వేరే డైరెక్టర్ తో రీ షూట్ చేశారని ఆ మధ్య బాగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అని కూడా తమిళ అర్జున్ రెడ్డి బృందం పెదవి విప్పింది.
మరి, అలాంటి డైరెక్టర్ తో ‘వైషవ్ తేజ్’ ఏ నమ్మకంతో సినిమా చేస్తున్నాడో ?, కథ బాగుంటే.. కథ తీసుకోవాల్సింది, అంతేగాని డైరెక్షన్ ఎలా ఇస్తారు ? అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్ పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
అయితే, ‘ఉప్పెన’తో యువతకు బాగా దగ్గరైన వైష్ణవ్ తేజ్ కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. వైష్ణవ్ తేజ్ ను ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేస్తోంది అని చెబుతున్నా.. అది ఎంతవరకు నిజం అనేది కూడా నమ్మకం లేనిది. ఇక ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Vaishnav tej next film with gireesaaya
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com