Devi Sri Prasad Ellamma : సంగీత దర్శకుడిగా నిన్నటి తరం ప్రేక్షకుల నుండి నేటి తరం ప్రేక్షకుల వరకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఎంటర్టైన్మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవి శ్రీ ప్రసాద్ ఒక సినిమాకు సంగీతం అందిస్తున్నాడంటే, ఆ చిత్రానికి క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళేవి ఆ రోజుల్లో. ఈమధ్య కాలం లో కొత్త తరం సంగీత దర్శకుల కారణంగా దేవిశ్రీ క్రేజ్ కాస్త తగ్గింది కానీ, ఒకప్పుడు మాత్రం వేరే లెవెల్ లో ఉండేవి. ముఖ్యంగా లవ్ స్టోరీస్ కి ఆయన అందించిన సంగీతం ఇప్పటికీ ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ రూపం లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలా సంగీత దర్శకుడిగా ఎన్నో సంచలనాలు సృష్టించిన దేవిశ్రీ ప్రసాద్ , ఇప్పుడు హీరో గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని ‘ఎల్లమ్మ’ చిత్రం తో గ్రాండ్ గా ప్రారంభించబోతున్నాడు.
‘బలగం’ లాంటి సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా , దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు కావడం తో , ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. గ్లింప్స్ వీడియో లో రఫ్ లుక్ తో , సంగీత విప్లవ కారుడిగా కనిపించిన దేవిశ్రీప్రసాద్ , నేటి ఫస్ట్ లుక్ లో మాత్రం మీసాలు , గెడ్డం లేకుండా , చాలా స్టైలిష్ గా రింగుల జుట్టుతో కనిపించారు. ఈ లుక్ ని చూసిన నెటిజెన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
ఇందులో దేవిశ్రీప్రసాద్ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడని , ఫ్లాష్ బ్యాక్ లో కుర్రాడి పాత్ర చాలా స్టైలిష్ గా , ఎమోషనల్ గా ఉంటుందని అంటున్నారు. చూస్తుంటే దేవిశ్రీప్రసాద్ కి మొదటి చిత్రం తోనే భారీ హిట్ దక్కేలా కనిపిస్తోంది. మరోపక్క ఈ చిత్రానికి ఆయన సంగీత దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. గ్లింప్స్ వీడియో కి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈమధ్య కొన్ని సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఫెయిల్ అవ్వడం తో , ఆయన పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ మంచి కంటెంట్ దొరికితే అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ ని అందిస్తాడని ఈ సినిమాతో మరోసారి అందరికీ క్లారిటీ వచ్చింది.
#Yellamma… and in it a man called PARSHI ❤️
Presenting the ACTOR @ThisIsDSP in a role rooted in the soil with a name you will remember and a journey you will never forget
We always celebrate his music… Along with that, let's celebrate him on the silver screen too … pic.twitter.com/zLsdRarC5G
— Sri Venkateswara Creations (@SVC_official) August 2, 2026