Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్స్ లు కూడా ఉన్నాయి. అలాగే సినిమాల్లో నటించేటప్పుడు ఒకరినొకరు గైడ్ చేసుకుంటూ అండర్స్టాండింగ్ తో నటించే ఆస్కారం ఉంది. వాళ్ళిద్దరి జంట కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మరి కొంతమంది నటి నటులు మాత్రం వాళ్ళ మధ్య ఏర్పడిన స్నేహాన్ని ప్రేమగా మార్చుకొని పెళ్లి చేసుకొని ఒకటైన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ హీరో అయిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇప్పుడు మరో మెగా హీరో మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ వాళ్ళ తమ్ముడు అయిన వైష్ణవి తేజ్, పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన రీతూ వర్మ ఇద్దరు ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇక వైష్ణవ్ తేజ్ రీతు వర్మ ప్రేమించుకుంటున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో కూడా ఉన్నారు అంటూ ఫిలింనగర్ సర్కిల్లో విపరీతమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొందరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరూ ఈ విషయం మీద ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
కాబట్టి వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా లేదంటే జస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటున్నారా అనే విషయం తెలియాలంటే మాత్రం వాళ్లలో ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది… మరి వీళ్ళ రిలేషన్ షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది. నిజంగా వీళ్ళ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ ఏనా లేదంటే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…







