Kangana Ranaut: గత పదేళ్ల నుండి బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ , హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది. ఈమధ్య కాలం లో కంగనా రనౌత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి , బీజేపీ ఎంపీ గా గెలిచిన తర్వాత హృతిక్ రోషన్ తో ఉన్న వివాదం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ రీసెంట్ గా ఆమె హృతిక్ రోషన్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా సోషల్ మీడియా లో ‘సారీ హృతిక్’ అనే ట్యాగ్ పై వేల సంఖ్యలో పోస్టులు పడ్డాయి , బాగా వైరల్ అయ్యింది, నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. దీనిపై హృతిక్ రోషన్ చాలా ఘాటుగా స్పందించాడు. వాస్తవాలను తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి అంటూ హితువు పలికారు.
ప్రముఖ రచయితా ఫ్రెడ్డీ బర్దీ ఇన్ స్టాగ్రామ్ లో ‘ ఈ ప్రపంచం మొత్తం హృతిక్ రోషన్ కి క్షమాపణ చెప్పాలి’ అంటూ పోస్ట్ చేశారు. దీనికి హృతిక్ స్పందిస్తూ ‘మీకు ఒక వ్యక్తి నచ్చకపోతే, ఆ వ్యక్తికీ సంబంధించిన శత్రువులకు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. వాస్తవాలను తెలుసుకున్న తర్వాతనే అభిప్రాయాలను వ్యక్తపర్చడం న్యాయం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది కచ్చితంగా గతం లో కంగనా రనౌత్ వివాదానికి సంబంధించినదే అని అందరికీ అర్థం అయిపోయింది. హృతిక్ చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందిస్తూ ‘సబా ఆజాద్ తో నీ జీవితం సంతోషం గా సాగుతుండడం నాకు చాలా ఆనందం గా ఉంది. కానీ నా పేరుతో కొందరు నన్ను వేదిస్తున్నప్పుడు నువ్వు వారిని ఖండించలేదు. పైగా మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావ్. అగ్నికి ఆజ్యం పోయొద్దు, ఇలాంటి వ్యాఖ్యలు చేసి నీ జీవిత భాగస్వామిని కూడా ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టొద్దు. ఇకనైనా అనవసరమైన వ్యాఖ్యలను ఆపేస్తావని ఆశిస్తున్నాను ‘ అంటూ చెప్పుకొచ్చింది.
ఇదంతా పక్కన పెడితే అసలు వీళ్లిద్దరి మధ్య వివాదం ఎలా పుట్టిందో పూర్తి వివరాలు చూద్దాం. 2016 వ సంవత్సరం లో కంగనా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ హృతిక్ రోషన్ ని తన ‘సిల్లీ ఎక్స్’ గా పేర్కొనింది. అంటే నా పాత బాయ్ ఫరెండ్ హృతిక్ రోషన్ చాలా సిల్లీ అని దాని అర్థం. అలా వ్యాఖ్యలు చేసినందుకు కంగనా రనౌత్ కి హృతిక్ రోషన్ లీగల్ నోటీసులు పంపాడు , ఆ తర్వాత కంగనా కూడా లీగల్ నోటీసులు పంపింది. అలా ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం అప్పట్లో సంచలనం గా మారింది. వీళ్లిద్దరు కలిసి గతం లో క్రిష్ 3 లో నటించారు.