Homeఆంధ్రప్రదేశ్‌Tirumala guest house : తిరుమల కొండపై ఇల్లు ని నిర్మించుకున్న ఏకైక హీరో అతనే...

Tirumala guest house : తిరుమల కొండపై ఇల్లు ని నిర్మించుకున్న ఏకైక హీరో అతనే అంటూ కమెడియన్ అలీ షాకింగ్ కామెంట్స్..

Tirumala guest house : సీనియర్ హీరో గా ఎన్నో సంచలనాత్మక కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ , ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషిస్తూ నేటి తరం ఆడియన్స్ ని కూడా ఆయన బాగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయన కీలక పాత్ర పోషించిన చిత్రం ‘మిస్టర్ మిడ్డిల్ క్లాస్’. శ్రీకాంత్ , లయ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా లో రాజేంద్ర […]

Tirumala guest house : సీనియర్ హీరో గా ఎన్నో సంచలనాత్మక కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ , ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషిస్తూ నేటి తరం ఆడియన్స్ ని కూడా ఆయన బాగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయన కీలక పాత్ర పోషించిన చిత్రం ‘మిస్టర్ మిడ్డిల్ క్లాస్’. శ్రీకాంత్ , లయ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా లో రాజేంద్ర ప్రసాద్ కలియుగ భగవంతుడు , వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించాడు. విడుదలకు ముందుకు ప్రొమోషన్స్ భాగంగా మూవీ టీం హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో , ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన కమెడియన్ అలీ రాజేంద్ర ప్రసాద్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘ఎంత మంది నటీనటులకు తిరుమల కొండపై వసతి గృహం ఉందో లేదో తెలియదు , హీరో రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభుత్వం అనుమతి ని కోరి ఒక స్థలం తీసుకొని ఒక గెస్ట్ హౌస్ ని కట్టుకున్నారు. ఎప్పుడైనా ఆయన తిరుమల కి వెళ్లినా , ఆయన బంధువులు వెళ్లినా ఆ గెస్ట్ లో ఉండేందుకు కోసం ఆయన నిర్మించాడు. తిరుమల కొండపై గెస్ట్ హౌస్ నిర్మించాడనే ఆయనకు వెంకటేశ్వర స్వామి ఈ పాత్రని పోషించే అదృష్టాన్ని కలిగించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అది డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి రూపం లో ఆయనకు దక్కింది. కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ కోసం పుడతారు. అలా రాజేంద్ర ప్రసాద్ కి ఇండస్ట్రీ లో గొప్ప పాత్రలు దక్కాయి. వాటిల్లో ఇదొకటి అని నేను బలంగా నమ్ముతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అలీ.

అయితే రాజేంద్ర ప్రసాద్ కి తిరుమల కొండపై సొంత గెస్ట్ ఉన్న విషయం తెలుసుకున్న నెటిజెన్స్ షాక్ కి గురయ్యారు. ఇండస్ట్రీ లో కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ సంపాదిస్తున్న హీరోలకే లేదు , అంతే కాకుండా రాజకీయ నాయకులకు కూడా ఇక్కడ గెస్ట్ హౌస్ లు ఉంటాయా అంటే అనుమానమే , అలాంటిది రాజేంద్ర ప్రసాద్ కి అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకునే అనుమతిని ఎవరు ఇచ్చారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కమెడియన్ అలీ మాట్లాడిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper