Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక పాట దాని తర్వాత ఎమోషనల్ సన్నివేశాలు చివరగా ఎలివేషన్ సీన్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి పెర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటారు. కాబట్టి సినిమా మొత్తం అద్భుతంగా ఉంటుంది. కమర్షియల్ డైరెక్టర్లకి చాలామంది అభిమానులైతే ఉంటారు. ఇక ఇదిలా ఉంటే 9 సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించిన అనిల్ రావిపూడి ఇప్పుడు 10 వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో కూడా భారీ విజయాన్ని సాధిస్తే ఆయనకు తిరుగుండదనే చెప్పాలి. అలాంటి అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నప్పటికి కొంతమంది స్టార్ హీరోలు మాత్రం అతనితో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట.
అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించని హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లు ఉన్నారు. ఈ ముగ్గురు హీరోలు అతనితో సినిమా చేయడానికి భయపడిపోతున్నారట. ఎందుకంటే అనిల్ రావిపూడి కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దగలడు. కానీ ఆయన సినిమాలు రొటీన్ టెంప్లేట్ లో ఉంటాయి.
వాటిని ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేయగలరు గాని భారీ రికార్డులను కొల్లగొట్టే విధంగా ఆ సినిమాలు ఉండవు. అందుకే స్టార్ హీరోలు అతనితో సినిమాలు చేయడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. ఈ హీరోలకు కథలను వినిపించే ప్రయత్నం చేసినా కూడా అది వర్కౌట్ కాలేదట. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో అనిల్ రావిపూడి తన పంథాను మార్చి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ లను తీయగలిగే కెపాసిటిని సంపాదించుకుంటాడా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్ కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాననే కాన్ఫిడెంట్ తో తను ఉండటం విశేషం…






