Trivikram: ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే నిరదోక్కుకుంటారు అని చెప్పడానికి త్రివిక్రమ్ ను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…అతనితోపాటు ఎంతో మంది రైటర్లు ఇండస్ట్రీలో తమ మార్కు చూపించాలనే ప్రయత్నం చేశారు. కానీ త్రివిక్రమ్ కు మాత్రమే అది సాధ్యమైంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మైథాలజికల్ సినిమాని చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కతాంశాన్ని ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్న త్రివిక్రమ్ ఇకమీదట తన పంథా ను మార్చుకోవాల్సిన అవసరమైతే వచ్చింది…
ఇక ఇప్పటివరకు అత్త, మామ, నాన్న అంటూ కుటుంబ కథ చిత్రాలను చేసిన త్రివిక్రమ్ పాన్ ఇండియాలో సినిమా చేయాలి అంటే మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయాల్సిన అవసరమైతే ఉంది. ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా సినిమా ఇండస్ట్రీలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితైతే రావచ్చు. మొత్తానికైతే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్నా ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకడిగా మారిపోతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే త్రివిక్రమ్ తను చేస్తున్న సినిమాల విషయంలో పూర్తి క్లారిటీతో ఉంటాడు.
ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా సినిమా మీద భారీ ఇంపాక్ట్ పడుతుందనే ఉద్దేశ్యంతో ఆయన ఒకటికి పది సార్లు కథ విషయంలో చాలా వరకు చర్చించుకుని మరి సినిమాని చేస్తుంటాడు. ఇక ఇప్పుడు కూడా అదే ధోరణిలో ముందుకు సాగుతున్నాడు. కానీ ఇప్పటివరకు తెలుగు సినిమాలను చేసినట్టుగా పాన్ ఇండియా సినిమాలను చేస్తే వర్కౌట్ కాదు. మొత్తానికైతే త్రివిక్రమ్ తన స్టైల్ ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది…