Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా రోహిత్ ని నిలబెట్టేందుకు హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరూ PR గా పని చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి చెప్పాలంటే రోహిత్ గేమ్ ‘అగ్నిపరీక్ష 2’ తో పోలిస్తే ‘బిగ్ బాస్ 10’ లోని గేమ్ చాలా తక్కువ. గణేష్ చాలా తక్కువగా ఆడాడు, ఆడిన వాటిల్లో అత్యధిక శాతం గెలవలేదు కూడా. అయినప్పటికీ రోహిత్ ఈ సీజన్ కప్పు కొడుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఎవరు కెప్టెన్ అయినా పర్వాలేదు, రోహిత్ మాత్రం కెప్టెన్ అవ్వకూడదు అనే తీరులో సెలబ్రిటీస్ ఉన్నారు. ఆ కారణం చేతనే రోహిత్ కి రోజురోజుకి సానుభూతి తారాస్థాయిలో పెరుగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో అయితే త్రిగున్ రోహిత్ ని దారుణంగా టార్గెట్ చేశాడని చెప్పొచ్చు.
త్రిగున్ తో పాటు సుధీర్ కూడా రోహిత్ ని దొంగ దెబ్బ తీశాడు. దీంతో రోహిత్ కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేకపోయాడు. ఒక టీం గా కలిసి ఆడుతున్నప్పుడు, టీం కోసం మాత్రమే ఆడాలి. కానీ త్రిగున్, సుధీర్ టీం ని మోసం చేసి, తమకు కావాల్సిన వాళ్ళను కెప్టెన్సీ కంటెండర్స్ ని చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న బాల్ గేమ్ ఒకటి జరిగింది. ఈ గేమ్ లోని రెండవ రౌండ్ లో సుధీర్ పాల్గొని ఝాన్సీ కోసం కావాలని ఓడిపోతాడు. టీం లోకి వచ్చినప్పుడు ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నాను, టీం కోసమే నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను, మన గెలుపు కోసమే ఆడుతాను అని ప్రమాణం చేస్తాడు సుధీర్. అయినప్పటికీ మాట తప్పడం తో సుధీర్ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
రోహిత్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సుధీర్ ని నిలదీయగా, బిగ్ బాస్ హౌస్ లో నా కుటుంబం ముకేష్, వర్షిణి, ఝాన్సీ అని సమాధానం ఇస్తాడు. ఈ ఒక్క మాటతో తన గ్రాఫ్ ని పాతాళం లోకి పడిపోయేలా చేసుకున్నాడు సుధీర్. ఇక త్రిగున్ విషయానికి వస్తే ఇక్కడ ఇంతమంది కెప్టెన్సీ కంటెండర్స్ గా ఇన్ని వారాలు చివరి వరకు వెళ్లి వచ్చాము. అలాంటిది మనం కాకుండా రోహిత్ ని కెప్టెన్సీ కంటెండర్ అయ్యేలా చేస్తానా?, అందుకే టీం కి ద్రోహం చేశా, గేమ్ ని మొత్తం మార్చేసా అంటూ వివరణ ఇచ్చుకుంటాడు త్రిగున్. ఆయన కేవలం రోహిత్ ని మాత్రమే కాదు, శివ్ కుమార్ ని కూడా దారుణంగా మోసం చేశాడు.
ఇలా హౌస్ లో త్రిగున్ మొదటి నుండి అడ్డమైన గేమ్స్ ఆడి, దానికి స్ట్రాటెజీ అనే పేరు పెడుతాడు. ఇలాంటి గేమ్ ఇన్ని రోజులు త్రిగున్ కి మాత్రమే సొంతం అని అంతా అనుకున్నారు. కానీ అతన్ని చూసి సుధీర్ కూడా చెడిపోయాడు. టీం కి ద్రోహం చేయడం అనేది చాలా పెద్ద తప్పు. మరి ఈ తప్పుని వీకెండ్ లో హోస్ట్ నాగార్జున అడ్రస్ చేసి త్రిగున్, సుధీర్ లను నిలదీస్తాడా?, లేదంటే వాళ్ళని సూపర్ స్ట్రాటెజీ వాడారు అంటూ పొగిడి, ఎప్పటి లాగానే రోహిత్ కి క్లాస్ పీకుతారా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.