Anandhi: గరివిడి లక్ష్మి సినిమా విడుదలైంది. ఈ సినిమాలో లక్ష్మిగా ఆనంది అదరగొట్టింది. ఆమె తప్ప మరొకరిని ఈ పాత్రకు ఊహించుకోలేము అన్నట్టుగా నటించింది. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు మొత్తం సోషల్ మీడియాలో ఇదే తరహాలో కామెంట్లు చేస్తున్నారు. ఆనంది నటన అద్భుతంగా ఉందని.. అసలు ఇన్నాళ్లపాటు ఈమెను మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు దూరం పెట్టిందని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
నటి ఆనంది కి తెలుగు సినిమాలలో అవకాశాలు తగ్గాయి.. ఆమె నటనలో ఏమైనా లోపం ఉందా.. లేక కథల ఎంపిక.. సినీ పరిశ్రమలోని లెక్కలే ఆమెకు అవకాశాలు రాకుండా చేశాయా.. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఆనంది స్వయంగా గతంలో చెప్పిన విషయాలను.. తాజాగా చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలించారు.
ఆనంది గతంలోనే తెలుగు సినిమాల్లో తనకు తగిన అవకాశాలు రాలేదని చెప్పేశారు.. 2025 లో ఆమె ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగు సినిమాలకు విరామం గురించి వివరించారు. తెలుగులో కెరియర్ మొదలుపెట్టిన తర్వాత తమిళంలో మంచి పాత్రలు రావడం.. అదే సమయంలో చదువు కొనసాగించడం వల్ల వ్యక్తిగత జీవితానికి సమయం.. గోప్యత అవసరమై తెలుగు సినిమాలకు కొంత విరామం ఇచ్చినట్టు ఆనంది చెప్పింది. తెలుగులో వచ్చిన కొన్ని కథలు నచ్చక వాటిని తిరస్కరించినట్టు కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అక్టోబర్ 15న గరివిడి లక్ష్మి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆనంది భావద్వేగానికి గురయ్యారు. సినీ పరిశ్రమంలో లెక్కలు.. రాజకీయాలు ఉంటాయని.. కొన్నిసార్లు తాను ఈ రంగానికి సరిపోనేమో అనిపిస్తుంది అని చెప్పారు. పరిశ్రమ తనను గుర్తించినా.. గుర్తించకపోయినా ప్రేక్షకులు తన నటనను గుర్తిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆమె మాట్లాడిన మాట్లాడిన చూస్తుంటే.. తన ప్రతిభకుతగట్టుగా గుర్తింపు లభించడం లేదనేది అర్థమవుతుంది. అయితే ప్రత్యేకించి ఒక నిర్మాత లేదా దర్శకుడు తనకు అన్యాయం చేశారని ఆమె ఎక్కడా చెప్పలేదు.
గరివిడి లక్ష్మి సినిమాలో ఆనంది జానపద కళాకారిణి జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర యాస.. భాషను.. భావోద్వేగాలను సహజంగా పలికించారు. దీనికోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి పాత్రలు నటిగా ఆమె సామర్థ్యాన్ని చూపించేందుకు ఉపయోగపడుతుంటాయి. అయితే ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయా లేదా. అనేది నిర్మాతలు.. దర్శకుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా తెలుగు దర్శకులు ఆమె కోసం కథలు రాయాలి. ఆమెను సినిమాలలోకి తీసుకోవాలి. ఆమెకు విస్తృతంగా అవకాశాలు ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. జాంబిరెడ్డి సినిమా ద్వారా ఆనంది తనలో ఉన్న మరో కోణాన్ని చూపించిందని.. కొన్ని సినిమాల్లో ఆమె పాత్రలకు ఏమాత్రం జస్టిఫికేషన్ లేకుండా చేశారని.. ఇప్పటికైనా ముంబై.. కన్నడ.. తమిళం.. మలయాళం వాళ్ల వైపు చూసే మన తెలుగు దర్శకులు.. ఆనందిలాంటి ఫ్రెష్ టాలెంట్ ను గుర్తించాలని.. అవకాశాలు కల్పించాలని.. అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు.