Sukumar: సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ముందుగా ఆయన రాసుకున్న కథను నమ్మి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ దొరకాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్ అంటే దర్శకుల పాలిట దేవుడనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడి యొక్క టాలెంట్ ను నమ్మి కొన్ని కోట్లని ఆ సినిమా మీద పెట్టుబడిగా పెడుతున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్ అనేవాడు దర్శకుడు దృష్టి లో ఎప్పుడు ఒక గొప్ప వ్యక్తి అనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే దిల్ సినిమా సమయంలో సుకుమార్ ను డైరెక్టర్ గా చేస్తానని దిల్ రాజు ఇచ్చిన ఒక మాటతో ఆయనని డైరెక్టర్ గా పరిచయం చేశాడు. ఇక నిజానికి ఈ సినిమా సమయంలో సుకుమార్ చాలావరకు ఇబ్బందులు ఎదుర్కొన్న కూడా తను అనుకున్నట్టుగా సినిమాని తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో సక్సెస్ కూడా అయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దిల్ రాజుకి సుకుమార్ కి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవట. ఎందుకంటే ఒక సీన్ తీసినప్పుడు దర్శకుడిగా సుకుమార్ చాలా హై లెవెల్లో ఆలోచిస్తూ ఉండేవాడట. కానీ దిల్ రాజు మాత్రం మన బడ్జెట్ ఇంతే అంటూ సుకుమార్ కి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండేవారట. దానివల్లే అంత తక్కువ బడ్జెట్ లో ఆ సినిమాను తెరకెక్కించిన కూడా సక్సెస్ అయితే కొట్టాడు.
ఇక ఆర్య సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అనుకున్న సమయంలో సుకుమార్ తప్పకుండా ఈ సినిమాకి కొన్ని మాంటేజ్ షాట్స్ తీయాలని చెప్పారట. ఇక అప్పుడు దిల్ రాజు లేదు ఇప్పటికే నీకు చాలా రోజులు టైం ఇచ్చాను ఆ టైం అయిపోయింది. అలాగే బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అయింది. ఇక దీంట్లో ఏ వేలు పెట్టకు ఇప్పుడు ఉన్న దాన్ని ఫైనల్ కట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేద్దాం అని చెప్పారట. కానీ దర్శకుడిగా సుకుమార్ కి అది నచ్చలేదట…ఎందుకంటే ఆ సినిమాలో ఆ మంటేజ్ షాట్స్ ఉంటేనే ఆ సినిమా ఫుల్ ఫీల్ అవుతుంది అని అనుకున్నాడు. కాబట్టి కొద్దిసేపు దిల్ రాజుతో గొడవకు దిగిన సుకుమార్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన కాళ్లు కూడా పట్టుకున్నాడట.
ఇక రీసెంట్ గా ఆర్య 20 ఇయర్స్ ఈవెంట్ లో ఈ విషయాన్ని సుకుమార్ తెలియజేశాడు. అయితే సినిమాకి న్యాయం జరగడం కోసం మనం ప్రొడ్యూసర్ కాళ్లు పట్టుకోవడంలో తప్పులేదు అంటూ సుకుమార్ చాలా గర్వంగా ఈ విషయాన్ని చెప్పాడు. అయితే సినిమా మొత్తం పూర్తయ్యే సమయానికి మూడుసార్లు దిల్ రాజు కాళ్లు పట్టుకున్నాడట. ఇక మొదటి సినిమా కాబట్టి ఆర్య సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను సుకుమార్ ఈ ఈవెంట్ లో గుర్తు చేసుకున్నాడు…