Producers meet Mahesh Babu: ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ‘వారణాసి'(Varanasi Movie) మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ కూడా ఎలాంటి హడావిడి లేకుండా చాలా స్మూత్ గా సాగిపోతూ ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చెయ్యాలని డైరెక్టర్ రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో పని చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి చాలా సస్పెన్స్ గా నిల్చిన అంశం. చాలా మంది ఆయన సందీప్ వంగ తో ఒక సినిమా చేస్తాడని అన్నారు. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ పేర్లు కూడా వినిపించాయి. ఏ డైరెక్టర్ తో పని చేయబోతున్నాడు అనేది ఇప్పట్లో చెప్పలేము కానీ, ఇండియా లోనే టాప్ ప్రొడక్షన్ హౌసులను మైంటైన్ చేస్తున్న నిర్మాతలు మహేష్ బాబు ని కలిశారు.
వారిలో ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఉంది. వీళ్ళు రీసెంట్ గానే మహేష్ బాబు ని కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి చర్చలు జరిపారట. అదే విధంగా KGF , సలార్ చిత్రాలను నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ కూడా మహేష్ బాబు తో చర్చలు జరిపారట. ఇక తమిళ నాడు లో సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ వంటి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి, సౌత్ లోనే టాప్ స్థానం లో ఉన్న సన్ పిక్చర్స్ అధినేత కూడా మహేష్ బాబు ని కలిసి తమతో ఒక సినిమా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారట. ప్రస్తుతం సన్ పిక్చర్స్ సంస్థ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ముంబై లో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళతో పాటు మహేష్ బాబు ‘వారణాసి’ మూవీ షూటింగ్ ని ముంబై లో చేస్తున్న సమయంలో ఇద్దరు బడా బాలీవుడ్ నిర్మాతలు ఆయన్ని కలిసినట్టు తెలుస్తోంది. ఇలా వారణాసి విడుదలకు ముందు ఇండియా వైడ్ గా ఉన్నటువంటి టాప్ మోస్ట్ నిర్మాతలు మహేష్ బాబు తో సినిమాలు చేయడానికి క్యూలు కట్టేస్తున్నారు. మహేష్ ముందుగా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘వారణాసి’ విడుదలకు ముందే ఇలా ఉంటే, ఇక విడుదల తర్వాత మహేష్ రేంజ్ ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. అందరి కంటే ఆలస్యం గా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెడుతున్నప్పటికీ, చాలా గ్రాండ్ గానే రీసౌండ్ వచ్చే రేంజ్ లో అడుగుపెడుతున్నాడని మహేష్ అభిమానులు గర్వం గా చెప్పుకుంటున్నారు.