Chiranjeevi Mahesh Babu Movie: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య సినిమాలపరంగా పోటీ ఉన్న కూడా పర్సనల్ విషయాల్లో మాత్రం వాళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారు. ఒకరి ఫంక్షన్స్ కి మరొకరు అటెండ్ అవుతూ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ని తెలియజేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇక ఇలాంటి నటుల నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆలోచించడమే కాకుండా ప్రేక్షకులందరు కలిసి అతనికి మెగాస్టార్ అనే ఒక బిరుదును కూడా ఇవ్వడం విశేషం…ఇక అలాంటి చిరంజీవి రానున్న రోజుల్లో మరికొన్ని సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలున్నీ టాప్ లెవల్లో నిలిచాయి… ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసుడికి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాప్ హీరోగా ముందుకు సాగడమే కాకుండా రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇక తను చేస్తున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక మాస్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్న మహేష్ బాబు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఫుల్ క్లారిటి మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు. చిరంజీవి – మహేష్ బాబు కాంబినేషన్ లో రెండు సినిమాలు రావాల్సింది.
కానీ ఆ రెండు సినిమాల్లో కూడా అనుకోకుండా మహేష్ బాబు ఆ సినిమాలో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ ను మొదట మహేష్ బాబుతో చేయించాలని అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఫైనల్ గా ఆ క్యారెక్టర్ ని రామ్ చరణ్ చేశాడు. మొత్తానికైతే సినిమా డిజాస్టర్ గా మారింది…
ఇక ఆ తర్వాత చిరంజీవి త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేదట. కానీ ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాకపోవడంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో రావాల్సిన మరో సినిమా మిస్ అయిందనే చెప్పాలి…