Pawan Kalyan: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికి పవర్ స్టార్ అనే ఒక ట్యాగ్ ను సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ, డైలాగుల్లో తన మార్కు కనబరుస్తూ ఉంటాడు. కానీ డాన్స్ లో మాత్రం ఆయన చాలావరకు వెనకబడిపోయాడు. డాన్స్ చేయమంటే సిగ్గుపడుతూ ఉంటాడు..డాన్స్ ఎలా చేయాలి. అందరి ముందు ఏదైనా తప్పు చేస్తే అందరు నవ్వుతారేమో అనేంత లా సిగ్గుపడే స్థాయి నుంచి ఇప్పుడు ఎంతో కొంత డ్యాన్స్ చేసే స్థాయికి అయితే వచ్చాడు. నిజానికి కెరియర్ స్టార్టింగ్ లో ఆయనకు అమితాబచ్చన్ అంటే చాలా ఇష్టం ఉండడంతో అతని డ్యాన్స్ లను చూస్తూ అతనిలాగే డాన్సర్ ప్రాక్టీస్ చేశాడు.
అందుకే పవన్ కళ్యాణ్ డాన్స్ లో ఎక్కువగా అమితాబచ్చన్ కనిపిస్తూ ఉంటాడనేది వాస్తవం. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కి ఇష్టమే అయినప్పటికీ చిరంజీవి కంటే కూడా నటుడిగా అమితాబచ్చన్ అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమట. పవన్ కళ్యాణ్ సైతం పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూనే ఏపీ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారాడు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో తన వంతు ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు.
ఎక్కడైతే ఆపద ఉందో అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడనేది ఇప్పుడు జనం అందరి నోట వినిపిస్తున్న మాట… అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమాతో ప్లాపు ను మూట గట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఇంకో సినిమాకైతే కమిట్ అవ్వలేదు. వచ్చే సంవత్సరం పవన్ కళ్యాణ్ ఒక సినిమాని స్టార్ట్ చేసి అదే ఇయర్లో ఆ సినిమాని రిలీజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…