Homeఎంటర్టైన్మెంట్VN Aditya about Uday Kiran: 'అత్తారింటికి దారేది' విజయం పట్ల అప్పట్లో ఉదయ్ కిరణ్...

VN Aditya about Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ విజయం పట్ల అప్పట్లో ఉదయ్ కిరణ్ మాట్లాడిన మాటలు ఇవే..వీడియో వైరల్!

VN Aditya about Uday Kiran: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, యూత్ ఐకాన్ గా మారడం అంటే సాధారణమైన విషయం కాదు. అలా అనితరసాధ్యమైన రేర్ ఫీట్ ని ఉదయ్ కిరణ్ సాధించి, మొదటి మూడు సినిమాలతోనే స్టార్ హీరో స్థాయికి ఎదిగిపోయాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ని మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుష్మిత ని ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకోవడం, నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా నిర్వహించడం, ఆ తర్వాత కొన్నాళ్ళకు ఉదయ్ కిరణ్ కి ఎందుకో అక్కడి వాతావరణం సరిపడక, నేను ఈ పెళ్లి చేసుకోలేనని చిరంజీవి చెప్పి తప్పుకోవడం వంటివి ఆరోజుల్లో సంచలనం సృష్టించాయి. అయితే అప్పటి నుండి చిరంజీవి కుటుంబం ఉదయ్ కిరణ్ ని ఇండస్ట్రీ లో ఎదగనివ్వకుండా తొక్కేసిందని, ఆయనకు వచ్చిన అవకాశాలను కూడా వెనక్కి వెళ్లేలా చేసిందని, ఇలా ఎన్నో రకాల ప్రచారాలు చేశారు.

అయితే రీసెంట్ గా VN ఆదిత్య ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈయన ఉదయ్ కిరణ్ తో ‘మనసంతా నువ్వే’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. అప్పటి నుండి వీళ్ళ మధ్య గొప్ప సాన్నిహిత్యం ఉండేది. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయే ఆరు రోజుల ముందు తనతో మాట్లాడిన మాటలను VN ఆదిత్య రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఉదయ్ కిరణ్ గారికి అత్తారింటికి దారేది అంటే చాలా ఇష్టం. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి, ఇండస్ట్రీ హిట్ స్టేటస్ కి చేరుకోవడంతో ఉదయ్ కిరణ్ చాలా సంతోషించాడు. నాకు ఫోన్ చేసి, అత్తారింటికి దారేది లాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న స్టోరీ ని రాయండి, మనం సినిమా చేద్దామని నాతో అన్నాడు. నేను స్టోరీ రాయడానికి సిద్దమయ్యాను. కానీ ఇంతలోపే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆయన నాతో స్టోరీ రాయమని చెప్పిన ఆరు రోజులకు ఈ ఘటన జరిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు VN ఆదిత్య.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అతనికి ఎలాంటి పరిస్థితులు అయినా ఎదురు అయ్యుండొచ్చు, కానీ ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం మాత్రం సరైనది కాదు. కష్టపడి పోరాడితే కచ్చితంగా ఇండస్ట్రీ లో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చు. అలా చాలా మంది హీరోలు కం బ్యాక్ ఇచ్చారు’ అంటూ చెప్పుకొచ్చాడు VN ఆదిత్య. ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా ఈ క్రింది వీడియో లో చూడొచ్చు. ఓటీటీ ఒక రేంజ్ లో వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో ఉదయ్ కిరణ్ కి ఎన్నో అద్భుతమైన అవకాశాలు వచ్చేవి. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని ఈ వీడియో ని చూసిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular