Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Harish Shankar missed movie: మహేష్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిస్...

Mahesh Babu Harish Shankar missed movie: మహేష్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన డిజాస్టర్ మూవీ అదేనా.. భలే తప్పించుకున్నాడుగా..

Mahesh Babu Harish Shankar missed movie: ఒకప్పుడు కమర్షియల్ డైరెక్టర్ గా అత్యధిక సక్సెస్ రేషియో ఉన్న వారిలో ఒకరు హరీష్ శంకర్(Harish Shankar). మిరపకాయ్ , గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇదంతా ఒకప్పుడు , ఇప్పుడు ఆయన పేరు తీస్తే , మీడియం రేంజ్ హీరోలు కూడా పారిపోయే రేంజ్ పరిస్థితి ఏర్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే మార్కెట్ లో ప్రస్తుతానికి మెహర్ రమేష్ కి , హరీష్ శంకర్ కి పెద్ద తేడా లేదని అనిపిస్తోంది. అది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో మరోసారి రుజువు అయ్యింది. ఈ సినిమాకు 5 నెలల ముందు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ తో ఓవర్సీస్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

కేవలం ఓవర్సీస్ ప్రీమియర్స్ షోస్ నుండే 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆయన. అలాంటి సూపర్ స్టార్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి కనీసం 1 మిలియన్ డాలర్లు కూడా రాలేదంటే , మన హరీష్ శంకర్ బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వ ప్రతిభకు ఎలాంటి ట్రోల్స్ పడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇంతటి బోరింగ్ సినిమా మరొకటి లేదని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత అప్ కమింగ్ హీరోలు కూడా హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపేలా లేరు , అంతటి అవుట్ డేటెడ్ అయిపోయాడు.

అయితే ఈ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలనీ అనుకున్నాడు, వీళ్ళ మధ్య ఆ సినిమా గురించి చర్చలు కూడా నడిచాయట. కానీ మహేష్ బాబు కి స్క్రిప్ట్ నచ్చకపోవడం తో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చిందట. ఆ సినిమా మరేదో కాదు , ‘దువ్వాడ జగన్నాథం’ . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రాన్ని ముందుగా మహేష్ బాబు తో తియ్యాలని అనుకున్నాడని , కానీ ఆయన ఒప్పుకోలేదని అంటున్నారు . ఒకవేళ ఒప్పుకొని ఉండుంటే మహేష్ కెరీర్ లో మరో భారీ డిజాస్టర్ ఫ్లాప్ దక్కేది. మహేష్ స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో జీనియస్ అని అనడానికి మరో నిదర్శనం గా ఈ సంఘటన గురించి చెప్పుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular