Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు తో సినిమా అంటే భయపడి పోయిన స్టార్ డైరెక్టర్...

Mahesh Babu: మహేష్ బాబు తో సినిమా అంటే భయపడి పోయిన స్టార్ డైరెక్టర్…

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్లతో సినిమాలను చేస్తే దర్శకులు గానీ ప్రొడ్యూసర్లు గానీ సేఫ్ జోన్ లో ఉండొచ్చు. భారీ బడ్జెట్ పెట్టినప్పటికి కలెక్షన్ల రూపంలో అంతకు మించిన డబ్బులు వస్తాయి. కాబట్టి స్టార్ ప్రొడ్యూసర్లు సైతం స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సైతం కెరియర్ స్టార్టింగ్ లోనే భారీ […]

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్లతో సినిమాలను చేస్తే దర్శకులు గానీ ప్రొడ్యూసర్లు గానీ సేఫ్ జోన్ లో ఉండొచ్చు. భారీ బడ్జెట్ పెట్టినప్పటికి కలెక్షన్ల రూపంలో అంతకు మించిన డబ్బులు వస్తాయి. కాబట్టి స్టార్ ప్రొడ్యూసర్లు సైతం స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సైతం కెరియర్ స్టార్టింగ్ లోనే భారీ సక్సెస్ లను సాధించి టాప్ హీరోగా మారిపోయాడు. ఇక అతనితో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నప్పటికి తను మాత్రం సెలెక్టెడ్ గా కొంతమందితో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మహేష్ బాబుతో సినిమా చేయమని ఒక దర్శకుడికి భారీ ఆఫర్ వచ్చినప్పటికి తను దానిని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే కృష్ణవంశీ కావడం విశేషం…గతంలో మహేష్ బాబుతో మురారి లాంటి సినిమాను చేసి అతనికి సక్సెస్ ను అందించిన కృష్ణ వంశీ ఆ తర్వాత చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చాడు.

Also Read: డేవిడ్ మిల్లర్.. అప్పుడు.. ఇప్పుడు.. నష్ట జాతకుడు

ఇక ఆ తర్వాత మహేష్ మాత్రం బిజినెస్ మేన్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇక అదే సమయంలో కృష్ణవంశీ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా చేయడానికి కొంతమంది ప్రొడ్యూసర్లు సన్నాహాలు చేశారు. మహేష్ బాబు డేట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండడంతో మహేష్ తో సినిమా చేద్దామని చెప్పారట. కానీ కృష్ణవంశీ మాత్రం భయపడిపోయాడట.

ఎందుకంటే మహేష్ ప్రస్తుతం టాప్ హీరోగా ముందుకెళ్తున్నాడు. అతని ఇమేజ్ ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటి నాకు లేదని నేను చిన్న హీరోలతో, మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పాడట. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోలను హ్యాండిల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్…

మనం కథ ఎలా రాసిన కూడా అది ప్రేక్షకులకి ముఖ్యంగా అభిమానులకు నచ్చే విధంగా తెరమీద ఆవిష్కరించాలి. లేకపోతే మాత్రం వాళ్ళ అభిమానులు ఒప్పుకోరు తద్వారా సినిమా ఫలితం తేడా కొట్టడమే కాకుండా దర్శకుడికి ఇండస్ట్రీలో కెరియర్ లేకుండా పోతుందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper