Bigg Boss 10 Telugu : ‘బిగ్ బాస్ 10’ ఎంత రసవత్తరంగా సాగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. గత సీజన్ పెద్ద హిట్ అనుకుంటే , ఈ సీజన్ దానికి మించిన హిట్ అయ్యేలా అనిపిస్తోంది. ఇప్పటికే హాట్ స్టార్ లో ఈ సీజన్ ని 1 కోటి 50 లక్షల మంది వీక్షించారట. వారం రోజుల్లో ఈ రేంజ్ వ్యూయర్షిప్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఆడియన్స్ మొదటి వారం పెద్దగా ఏమి ఉండదు లే , టాస్కులు జరిగి గొడవలు జరిగినప్పుడు చూడొచ్చు అనే మైండ్ సెట్ తో ఉంటారు. నాలుగు వారాల తర్వాత వ్యూయర్షిప్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ సీజన్ కి మొదటి వారం నుండే ఈ రేంజ్ రెస్పాన్స్ ని బహుశా మేకర్స్ కూడా ఊహించి ఉండరు.
ఈ రేంజ్ వ్యూయర్షిప్ రావడానికి కారణం మొదటి వారం లో కలలో కూడా ఊహించని షాకులు , ట్విస్టులు ఇవ్వడం వల్లే అని చెప్పొచ్చు. కేవలం 5 రోజుల్లోనే చరణ్, చైత్ర లను ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ టీం , నేడు సుధీర్ రెడ్డి ని కూడా ఎలిమినేట్ చేశారు. అయితే చరణ్ , చైత్ర లను ఆడియన్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ చెయ్యలేదు కదా, కచ్చితంగా వీళ్ళను సీక్రెట్ రూమ్ లో ఉంచారేమో అని అంతా అనుకున్నారు. లోపల ఉన్నటువంటి హౌస్ మేట్స్ ఫీలింగ్ కూడా ఇదే. కానీ అది జరగలేదని కాసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమోతో అర్థమైంది. నాగార్జున ఎలిమినేట్ అయినటువంటి చరణ్, చైత్రాలతో వీడియో కాల్ లో కంటెస్టెంట్స్ తో మాట్లాడించి , మేము ఇంటికి వెళ్ళిపోయాము అని చెప్పిస్తాడు.అనంతరం
నాగార్జున కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ , ఆట లో అలసత్వం చూపిస్తే ఇంటికి వెళ్లిపోవాల్సిందే అని వార్నింగ్ ఇస్తాడు. ఇద్దరు కంటెస్టెంట్స్ వెళ్లిపోయిన తర్వాత కూడా హౌస్ లో కొంతమందికి గేమ్ పట్ల సీరియస్ నెస్ రాలేదు. అలాంటి వాళ్ళ కోసం ఇదొక వార్నింగ్ కాల్ లాంటిది. ఉదాహరణకు కృష్ణుడు ని తీసుకోండి. ఇతను ఈ వారం మొత్తం ఆడింది ఏమి లేదు. అయినప్పటికీ కూడా గేమ్ ఆడే అవకాశం వస్తే , నేను ఆడలేను అంటూ ఒక మూలాన కూర్చున్నాడు. ఇలాంటోళ్లకు వార్నింగ్ అన్నమాట. కనీసం ఈ వార్నింగ్ తో అయినా ఇలాంటి కంటెస్టెంట్స్ లో మార్పు వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఇలాగే ఆటని సీరియస్ గా తీసుకోకపోతే , వచ్చే వారం కూడా ట్రిపుల్ ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.