Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: త్రిగున్ కి 'బిగ్ బాస్' హిస్టరీ లోనే ఎవరికీ వెయ్యని...

Bigg Boss 10 Telugu: త్రిగున్ కి ‘బిగ్ బాస్’ హిస్టరీ లోనే ఎవరికీ వెయ్యని శిక్ష వేసిన నాగార్జున!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ కి చిరునామా లాంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే , అది త్రిగున్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఒక ప్లాన్ ప్రకారం, కంటెంట్ కోసం త్రిగున్ ఇలాంటి పనులు చేస్తున్నాడా?, లేదంటే అతని ప్రవర్తన ఇలాగే ఉంటుందా అనేది అర్థం కావడం లేదు. కానీ రోహిత్ ని అతను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచినప్పటి […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ కి చిరునామా లాంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే , అది త్రిగున్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఒక ప్లాన్ ప్రకారం, కంటెంట్ కోసం త్రిగున్ ఇలాంటి పనులు చేస్తున్నాడా?, లేదంటే అతని ప్రవర్తన ఇలాగే ఉంటుందా అనేది అర్థం కావడం లేదు. కానీ రోహిత్ ని అతను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచినప్పటి నుండి చేస్తున్న టార్గెట్ చూస్తుంటే , అసలు ఒక మనిషి మరో మనిషి పై ఇంత పగ పెట్టుకుంటారా?, సినిమాల్లో , సీరియల్స్ లో కూడా ఇలాంటోళ్లని చూడలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇతని పై నాగార్జున కచ్చితంగా ఫైర్ అవ్వాలి , కఠినమైన శిక్ష విధించాలని అంతా అనుకున్నారు.

అందరి అంచనాలను , ప్రేక్షకుల కోపాన్ని దృష్టిలో పెట్టుకొని , ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ మీద కూడా ఫైర్ అవ్వనంతలా , త్రిగున్ పై ఫైర్ అయ్యాడట నాగార్జున. ఆయనలో ఫైర్ యాంగిల్ ని గతం లో మనం చాలా తక్కువ సందర్భాల్లోనే చూశాం . కానీ ఈరోజు మాత్రం నాగార్జున విశ్వరూపాన్నే చూపించాడట. అంతే కాదు ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కి విధిమ్చని శిక్ష ని త్రిగున్ కి విధించాడట నాగార్జున. అది రెడ్ కార్డు ఎలిమినేషన్ చేశారా? , లేదా వేరే ఏదైనా కఠినమైన శిక్ష విధించాడా అనేది చూడాలి. కేవలం త్రిగున్ కి మాత్రమే కాదు , అతనికి సపోర్టు గా నిల్చిన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కి కూడా గట్టి కోటింగ్ పడిందట. వారిలో కృష్ణుడు కూడా ఉన్నాడు. ఈయన కూడా రోహిత్ పై చాలా లూజ్ మాటలు వదిలేసిన సంగతి తెలిసిందే.

రోహిత్ తనని వీక్ అన్నాడని కృష్ణుడు అతని పై ఇంత పగబట్టాడు. కానీ త్రిగున్ మరియు మిగిలిన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కృష్ణుడు ని వీక్ కాబట్టే అతన్ని హై రిస్క్ జోన్ లో పెట్టారు. కానీ అతను ఇది గ్రహించలేదు. అంతే కాదు , ఈ వారం మొత్తం ఆయన ఒక్క టాస్క్ కూడా ఆడలేదు . ఛాన్స్ దొరికినప్పుడల్లా తోటి సెలబ్రిటీస్ తో కూర్చొని రోహిత్ పై చాడీలు చెప్పడానికే సమయం మొత్తం సరిపోయింది. అలా ఆతని చాలా తేలికగా తీసుకున్నందుకు కృష్ణుడు కి కూడా గట్టి కోటింగ్ పడిందట. చూడాలి మరి ఈ కోటింగ్ తో వీళ్ళిద్దరిలో మార్పు వస్తుందా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper