Payal Rajput : టాలీవుడ్ లో పాయల్ రాజ్ పుత్ కి గ్రేట్ స్టార్ట్ లభించింది. ఆర్ ఎక్స్ 100 మూవీతో పాయల్ ఓవర్ నైట్ పాప్యులర్ అయ్యారు. పాయల్ గ్లామర్ కి యూత్ పిచ్చెక్కిపోయారు. ఆర్ఎక్స్ 100 లో ఆమె బోల్డ్ రోల్ చేశారు. శృంగార సన్నివేశాల్లో హద్దులు దాటి నటించారు. కార్తికేయ హీరోగా నటించిన ఆ చిత్రానికి అజయ్ భూపతి దర్శకుడు. ఆర్ఎక్స్ 100 సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో వచ్చిన ఫేమ్ కి పాయల్ రాజ్ పుత్ పరిశ్రమను ఏలేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే అలా జరగలేదు. పాయల్ వరుస పరాజయాలతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది.