Pushpa 2 : అల్లు అర్జున్ ఇమేజ్ పదిరెట్లు పెంచిన చిత్రం పుష్ప. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకుంది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ పుష్ప తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీలో ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. పుష్ప హిందీ వర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ పుష్ప రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో పార్ట్ 2 భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు.
కాగా పుష్ప 2 పై క్రేజీ అప్డేట్ అందుతుంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందట. ఓ రిసార్ట్ లో సాంగ్ చిత్రీకరిస్తున్నారట. ఈ సాంగ్ చిత్రీకరణలో అల్లు అర్జున్, రష్మిక మందాన పాల్గొంటున్నారట. ఇది పార్టీ సాంగ్ అని సమాచారం. పుష్ప రాజ్ తన మిత్రులకు పార్టీ ఇచ్చే క్రమంలో వచ్చే సాంగ్ అట. మొన్నటి వరకు ఏపీలోని మారేడుమిల్లిలో చిత్రీకరణ జరిపారు. లారీలతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు
తాజాగా సాంగ్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. కాగా పుష్ప 2 ఊహించిన దానికంటే ముందే థియేటర్స్ లోకి వస్తుందని సమాచారం. 2023 డిసెంబర్ లో రిలీజ్ చేయాలని యూనిట్ ప్రణాళికలు వేస్తున్నారట. అయితే చిత్ర యూనిట్ ఇంత వరకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో చిన్న సందిగ్ధత నెలకొంది. 2024 సమ్మర్ కి విడుదల చేయాలనే ఆలోచన కూడా ఉందట. పుష్ప 2 పట్ల ఇండియా వైడ్ హైప్ ఉంది. రూ. 1000 కోట్లు కొల్లగొడతామని యూనిట్ విశ్వాసంతో ఉంది.
మొదటి భాగంలో అల్లు అర్జున్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లో చెట్లు నరికే కూలీగా కనిపించారు. పార్ట్ 2 ఈ మాఫియా లీడర్ గా, నెట్వర్క్ మొత్తం నడిపించే సిండికేట్ కింగ్ గా కనిపించనున్నారు. మెయిన్ విలన్ రోల్ చేస్తున్న ఫహద్ ఫాజిల్ తో అల్లు అర్జున్ పోరు హైలెట్ కానుంది. పార్ట్ 1లో కేవలం క్లైమాక్స్ కి ముందు ఫహద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.