Homeఎంటర్టైన్మెంట్Ravi Teja: రవితేజ నటించిన ఏకైక బ్లాక్ బస్టర్ సీరియల్ ఇదే

Ravi Teja: రవితేజ నటించిన ఏకైక బ్లాక్ బస్టర్ సీరియల్ ఇదే

రవితేజ గురించి తెలుసుకుంటే ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే స్టార్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇక్కడతోనే ఈయన ప్రయాణం ఆగిపోలేదు.

Ravi Teja: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టార్లు అవుతారనే గ్యారంటీ లేదు. కొందరు మాత్రమే స్టార్లుగా నిలిచి చెదరని ముద్ర వేసుకుంటారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. చిరు తన ఫ్యామిలీని ఇండస్ట్రీలోనే సెట్ చేశారు. అలాగే రవితేజ లాంటి వారు కూడా కొందరు స్టార్లుగా నిలిచారు. ఇక టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా అదృష్టం కూడా ఉండాలి. రెండు ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు.

ఇక రవితేజ గురించి తెలుసుకుంటే ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే స్టార్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇక్కడతోనే ఈయన ప్రయాణం ఆగిపోలేదు. కమెడియన్ గా కూడా పలు సినిమాల్లో నటించారు రవితేజ. ఇలా ఎంతో కష్టపడ్డ మాస్ మహారాజ తనేంటో నిరూపించుకున్నాడు. ఒకప్పుడు ఇతర హీరోల సినిమాల్లో నటించిన రవితేజ ఇప్పుడు ఈయన నటించే సినిమాల్లోనే ఆయా హీరోలు సైడ్ క్యారెక్టర్లుగా నటిస్తున్నారు. ఇది కదా విజయం అంటే..

రవితేజ సినిమాల్లో మాత్రమే కాదు సీరియల్ లో కూడా నటించారు అనే విషయం తెలుసా? ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అప్పట్లో దూర దర్శన్ లో ప్రసారమైన ఋతురాగాలు అనే సీరియల్ లో ఒక ఎపిసోడ్ లో చిన్న పాత్రలో నటించారు మాస్ రాజా. ఇక ఈ సీరియల్ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సమయంలోనే ఈ సీరియల్ లో నటించారు. దీని తర్వాత చాలా సీరియల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. కానీ ఎందుకో రిజక్ట్ చేశారట. ఇందులో రాజీవ్ కనకాల హీరోగా రూపాదేవి హీరోయిన్ గా నటించారు. ఇప్పుడు మీరు ఈ సీరియల్ చూడాలి అనుకుంటే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper