Balakrishna And Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి క్రమంలోనే చాలామంది నటులు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ వాళ్ల కంటు ఒక ప్రత్యేకతను సంతరించుకోవడానికి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలకృష్ణ ఒకరు…
వాళ్ల తండ్రి అయిన ఎన్టీయార్ నట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ యువరత్న నందమూరి బాలకృష్ణ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే అదే సమయంలో వెంకటేష్ కూడా మంచి సినిమాలు చేయడమే కాకుండా ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే బాలకృష్ణ, వెంకటేష్ ఇద్దరు అప్పట్లో సరదాగా ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు బాలయ్య వెంకటేష్ తో ఎప్పుడు ఫ్యామిలీ సినిమాలే ఏం చేస్తావ్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి యాక్షన్ సినిమాలు చేయి అని అనడంతో వెంకటేష్ నవ్వి బాలయ్య నువ్వు కూడా ఒకసారి పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం లాంటి క్లాస్ సినిమాలు చేయమని అడగగా బాలయ్య కంగుతిని వామ్మో ఫ్యామిలీ సినిమాల మనవల్ల కాదు అంటూ తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా బాలయ్య బాబు సరదాగా అడిగిన క్వశ్చన్ కి వెంకటేష్ కూడా సరదాగా ఆన్సర్ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచాయి…ఇక వీళ్లిద్దరూ గత 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కి వాళ్ల సేవలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.ఇక ఇప్పుడు కూడా వాళ్ళు సోలో హీరోలు గా చేస్తూ రాణిస్తున్నారు. ఇప్పటికీ వాళ్ల మార్కెట్ ఎక్కడ తగ్గకుండా చూసుకుంటూనే విజయాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు…
అలాగే యంగ్ హీరోలకి పోటీ ఇస్తు విశ్రాంతి లేకుండా వరుస సినిమా షూటింగ్ లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇప్పుడు వెంకటేష్ సైంధవ్ సినిమాతో రిలీజ్ కి రెఢీ గా ఉన్నాడు. బాలయ్య బాబు మాత్రం డైరెక్టర్ బాబీ సినిమా షూటింగ్ లో ఉన్నాడు… ఇలా సీనియర్ హీరోలు అయిన వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం బంధం కూడా ఉంది. నిజానికి బాలయ్య, వెంకటేష్ కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు మరి ఫ్యూచర్ లో ఈ కాంబో లో సినిమా వస్తుందేమో చూడాలి…