Irumudi Movie Collection: మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ ముందు #RRR, బాహుబలి రికార్డ్స్ కూడా బద్దలు అవుతున్నాయి. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్, పాటలు చూసి కచ్చితంగా ఈ చిత్రం రవితేజ కి కం బ్యాక్ గా నిలుస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ రేంజ్ కం బ్యాక్ ని మాత్రం అసలు ఊహించలేదు. కేవలం ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం, ఆ తర్వాత ఫుల్ రన్ అద్భుతాలనే నెలకొల్పోతోంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ తో పోలిస్తే, 10 వ రోజున వచ్చిన కలెక్షన్స్ అనేక ప్రాంతాల్లో భారీగా ఉన్నాయట. ఓవరాల్ గా 10 వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 9 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 44 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 12 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం నైజాం ప్రాంతం లో 50 కోట్ల షేర్ మార్కుని, అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో ఈ వీకెండ్ తో 20 కోట్ల షేర్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 9 కోట్ల 70 లక్షలు, ఈస్ట్ గోదావరి నుండి 5 కోట్ల 70 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 3 కోట్ల 50 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 4 కోట్ల 80 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 4 కోట్ల 50 లక్షలు, నెల్లూరు నుండి 2 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 89 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 145 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 106 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 175 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంతే కాకుండా 85 కోట్ల రూపాయిల వరకు బయ్యర్స్ కి లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకోబోతుంది. ఫుల్ రన్ లో కచ్చితంగా 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.