They Call Him OG: పవన్ కళ్యాణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వం లో గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి జెన్ జీ యూత్ ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిపారు. హిందీ వెర్షన్ లో భారీ రేంజ్ లో ఈ సినిమా విడుదల అవ్వనప్పటికీ, వరల్డ్ వైడ్ గా కేవలం తెలుగు వెర్షన్ నుండే 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం. ఒకవేళ బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని భారీ గా ప్రమోట్ చేసి విడుదల చేసుంటే కచ్చితంగా 500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదని అంటున్నారు విశ్లేషకులు.
ఇకపోతే నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ విడుదల అయ్యాక, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో మంచి రీచ్ వచ్చింది. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇండియా వైడ్ గా బాగా ఫేమస్ అయ్యింది నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాతే. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న ఈటీవీ లో టెలికాస్ట్ చేశారు. ఓజీ లాంటి సినిమా ఈటీవీ లో రావడమేంటి అని సోషల్ మీడియా లో ట్రోల్స్ వేసినప్పటికీ , ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 11 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయట. ఈటీవీ లో ఈమధ్య కాలంలో ఒక సినిమాకు ఈ రేంజ్ రేటింగ్స్ రాలేదని , ఓజీ సరికొత్త చరిత్ర సృష్టించిందని అంటున్నారు. సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ సినిమాలకే టీవీ లో ఆ స్థాయి రేటింగ్స్ వస్తుంటాయి.
కానీ ఒక అర్బన్ గ్యాంగ్ స్టర్ మూవీ కి ఈటీవీ లో అంత రేంజ్ రెస్పాన్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. భవిష్యత్తులో ఈ జానర్ సినిమాలకు ఇలాంటి రికార్డు రావడం కూడా కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే వచ్చే ఏడాది సమ్మర్ నుండి ‘ఓజీ 2’ మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 17 నుండి బ్లడీ రోమియో షూటింగ్ తో బిజీ అవ్వనున్న సుజిత్ , ఈ సినిమా అయిపోగానే ‘ఓజీ 2’ కి షిఫ్ట్ అవుతాడట.