Pawan Kalyan: టాలీవుడ్ , కోలీవుడ్ ఫ్యాన్స్ చిరకాల డ్రీం ఈ నెల 13 న నెరవేరబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13 న ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వబోతున్నారు. తమిళనాడు , ఆంధ్ర ప్రదేశ్ మధ్య జరగాల్సిన నీటి ఒప్పందం పై ఈ సందర్భంగా చర్చించుకోనున్నారు అట. అనంతరం సీఎం చంద్రబాబు , విజయ్ , పవన్ కళ్యాణ్ కలిసి విజయవాడ ఉత్సవాల్లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. రీసెంట్ గానే విజయ్ , అజిత్ కలిసిన ఫోటోలు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేశాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ , విజయ్ కలిసి దిగిన ఫోటోలు అంతకంటే ఎక్కువ వైరల్ అవుతాయని అంటున్నారు నెటిజెన్స్.
తమిళనాడు లో విజయ్ కి ఎంతటి క్రేజ్ ఉందో , తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే ఇక్కడి పరిస్థితుల కారణంగా ఆయన సీఎం అవ్వలేకపోయాడు , విజయ్ సీఎం అయ్యాడు. దీనిపై సోషల్ మీడియా లో ఇప్పటికీ డిబేట్స్ నడుస్తూనే ఉంటాయి. ఇద్దరిలో ఒకరు తక్కువ కాదు , ఒకరు ఎక్కువ కాదు , ఇంకా చెప్పాలంటే విజయ్ తో పోలిస్తే కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ అని కొంతమంది రాజకీయ విస్లేహకులు అంటుంటారు. కానీ నిజానికి ఇద్దరు సమానమే. వీళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో ప్రముకమైన స్థానాల్లో జనాలకు సేవలు అందిస్తున్నారు కాబట్టి , ఎదో ఒక రోజు కచ్చితంగా కలుసుకుంటారని అంతా ఊహించారు. ఊహించినట్టుగానే వీళ్ళ కలయిక త్వరలోనే జరగనుంది. వీళ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వచ్చిన తర్వాత ఏ రేంజ్ వైరల్ అవుతాయో చూడాలి.
విజయ్ పవన్ కళ్యాణ్ కి స్వతహాగా వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ ‘బంగారం’ మూవీ లాంచ్ రోజున చెప్పాడు , అదే విధంగా వీళ్ళిద్దరితో పని చేసిన డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా విజయ్ గురించి అనేక సందర్భాల్లో గొప్పగా మాట్లాడాడు. వీళ్లిద్దరు కలిస్తే కచ్చితంగా మ్యూచువల్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ మీటింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.