Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ కళ్యాణ్, అన్నా లెజ్ నోవా వ్యవహారంలో.. ఆ పత్రికా యజమానికి ఎందుకంత...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, అన్నా లెజ్ నోవా వ్యవహారంలో.. ఆ పత్రికా యజమానికి ఎందుకంత ఇంట్రెస్ట్..

Pawan Kalyan:గిట్టని వాళ్ళ మీద రాళ్లు వేయడం.. నచ్చిన వాళ్ల మీద పన్నీరు చల్లడం.. అందులో కాసులు ఏరుకోవడం ఆ పత్రిక యజమానికి పెన్నుతో పెట్టిన విద్య. ఒక సాధారణ పాత్రికేయుడు నుంచి ఈరోజు ఒక పత్రికకు.. ఒక ఛానల్ కు.. వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయ్యాడు. పైగా తనను తాను గొప్పవాడిగా.. పాత్రికేయ లోకంలో శుద్ధపూసగా అభివర్ణించుకుంటూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను భూతద్దంలో పెట్టి చూసే బుద్ధి అతడిది. అందువల్లే అతడిని బూతు […]

Pawan Kalyan:గిట్టని వాళ్ళ మీద రాళ్లు వేయడం.. నచ్చిన వాళ్ల మీద పన్నీరు చల్లడం.. అందులో కాసులు ఏరుకోవడం ఆ పత్రిక యజమానికి పెన్నుతో పెట్టిన విద్య. ఒక సాధారణ పాత్రికేయుడు నుంచి ఈరోజు ఒక పత్రికకు.. ఒక ఛానల్ కు.. వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయ్యాడు. పైగా తనను తాను గొప్పవాడిగా.. పాత్రికేయ లోకంలో శుద్ధపూసగా అభివర్ణించుకుంటూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను భూతద్దంలో పెట్టి చూసే బుద్ధి అతడిది. అందువల్లే అతడిని బూతు బాబు అని పిలుస్తుంటారు. ఇంకా వేరే పేర్లు ఉన్నాయి గాని.. ఇక్కడ రాయడం సబబు కాదు.

పవన్ కళ్యాణ్ అన్నా లెజ్ నోవా వ్యవహారంలో ఆ పత్రిక యజమాని వ్యవహరించిన తీరు ఇప్పుడు జర్నలిజం సర్కిల్ లో ఆశ్చర్యానికి కారణమవుతోంది. ఈ వ్యవహారం మీద మిగతా మీడియా సంస్థలు నిశ్శబ్దంగా ఉంటే.. ఆ పత్రిక మాత్రం మాస్టర్ హెడ్ పక్కన రాసుకొచ్చింది. అది కూడా తాటికాయ పరిమాణంలో అక్షరాలతో పబ్లిష్ చేసింది. అంతేకాదు దీనిమీద డిబేట్.. కథనాల మీద కథనాలు ప్రసారం చేయడం మొదలుపెట్టింది. వాస్తవానికి ఒక సెలబ్రిటీ వ్యక్తిగత జీవితానికి అంతగా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. అందులోనూ లోతుగా చూడాల్సిన అవసరం లేదనే కనీస ఇంగితం ఆ పత్రిక యజమానికి లేకపోవడం విశేషం. టిడిపి.. వైసిపి ఇప్పటికే పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారంలో ఎటువంటి విషయాలు బయటకు చెప్పకూడదని తీర్మానించాయి. అలాంటప్పుడు ఈ పత్రిక యజమానికి అంత దురద ఏమిటో అర్థం కాదు.

గతంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఈ పత్రిక యజమాని అడ్డగోలుగా రాశాడు. పైగా 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి పవన్ కారణమంటూ సరికొత్త వాదన తెరమీదకు తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతి సందర్భంలోనూ ఆ పత్రిక యజమానికి ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది. అది ఎందుకో అర్థం కాదు.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను బయటపెట్టాల్సిన అవసరం ఆ పత్రిక యజమానికి ఏముంది.. ఆ ప్రకారం చూసుకుంటే ఆ పత్రిక యజమాని ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇటీవల కాలంలో ఆ పత్రిక యజమాని కంపెనీ వ్యవహారాలకు సంబంధించి జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ఆ పత్రిక యజమాని మిగతా వాళ్లకు ఎలా నీతులు చెబుతాడు.. వాళ్ల వ్యక్తిగత విషయాలను ఎలా రాయగలుగుతాడు.. పవన్ కళ్యాణ్ ఏదైనా తప్పు చేస్తే రాయొచ్చు. అక్రమాలకు పాల్పడితే వెలుగులోకి తీసుకురావచ్చు. అంతేగాని వ్యక్తిగత జీవితాన్ని ఇలా పేపర్ మీద తాటికాయ పరిమాణంలో రాసి.. చానల్లో గంటలు గంటలు డిబేట్లు పెట్టి.. పొందే శునకానందం ఏమిటో అర్థం కాదని జనసేన కార్యకర్తలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper