Epic Movie: ‘బేబీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న చిత్రం ‘ఎపిక్’. థియేటర్స్ లో అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా నిన్న నెట్ ఫ్లిక్స్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు తో పాటు హిందీ , తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. అయితే ఓటీటీ ఆడియన్స్ నుండి మాత్రం ఈ చిత్రానికి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్ గా ఉందని , కానీ సెకండ్ హాఫ్ కాస్త సాగదీశారు కానీ , ఓవరాల్ గా టైం పాస్ ఎంటర్టైనర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈటీవీ విన్ యాప్ లో సూపర్ హిట్ గా నిల్చిన ’90s మిడిల్ క్లాస్ బయోపిక్’ కి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆ సిరీస్ లో శివాజీ రెండవ కొడుకు ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఆ బుడ్డోడు పెరిగి పెద్దయ్యాక విదేశాలకు వెళ్లి చదువుకునేటప్పుడు ఎదురైనా సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదొక రొమాంటిక్ బోల్డ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. కానీ ఇలాంటి సినిమాలు ఓటీటీ లో చూసేందుకే బాగుంటాయి, థియేటర్స్ లో ఇలాంటి సినిమాలు పనికిరావు. అందుకేనేమో నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓటీటీ లోకి వచ్చింది కదా అని ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి సినిమా చూడాలని అనుకోకండి , ఎందుకంటే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు వాళ్లకు చూసేందుకు ఇబ్బంది కలిగించవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.
ఇదంతా పక్కన పెడితే ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య లను పెట్టి ‘చెన్నై లవ్ స్టోరీ’ తియ్యాలని అనుకున్నాడు సాయి రాజేష్. అప్పట్లో ఫోటో షూట్ చేసి కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియా లో విడుదల చేశారు . కానీ కొన్ని అనుకోని కారణాలు వల్ల వీళ్లిద్దరు ఆ సినిమా నుండి తప్పుకొని , ‘ఎపిక్’ చిత్రాన్ని ఒప్పుకున్నారు. వీళ్ళు మిస్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ లో చెన్నై లవ్ స్టోరీ వచ్చి ఉండుంటే ఫలితం ఇంకా మెరుగ్గా ఉండేదేమో అని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.