Homeఎంటర్టైన్మెంట్The Traitors: తేజ సజ్జ 'ట్రైటర్స్' షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే!

The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే!

The Traitors: హిందీ లో బిగ్ బాస్ కి పోటీ గా అనేక రియాలిటీ షోస్ వచ్చాయి , ఘనవిజయం సాధించాయి. వాటిల్లో ‘ది ట్రైటర్స్’ అనే షో కూడా ఒకటి. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో హిందీ లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ షో తెలుగు లో కూడా రాబోతుంది. ఈ షో కి వ్యాఖ్యాతగా తేజ సజ్జ వ్యవహరించబోతున్నాడు. ఈ షో కి సంబంధించిన ప్రోమో ని నిన్ననే […]

The Traitors: హిందీ లో బిగ్ బాస్ కి పోటీ గా అనేక రియాలిటీ షోస్ వచ్చాయి , ఘనవిజయం సాధించాయి. వాటిల్లో ‘ది ట్రైటర్స్’ అనే షో కూడా ఒకటి. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో హిందీ లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ షో తెలుగు లో కూడా రాబోతుంది. ఈ షో కి వ్యాఖ్యాతగా తేజ సజ్జ వ్యవహరించబోతున్నాడు. ఈ షో కి సంబంధించిన ప్రోమో ని నిన్ననే విడుదల చేశారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ షో లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తం మీద ఈ షో లో 20 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారట. ఆ 20 మంది పేర్లు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అవుతోంది.

ప్రధానంగా వినిపిస్తున్న మొదటి పేరు వర్ష. ఈమె పాపులర్ యూట్యూబర్, ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించి యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఈమె ఈ షో లో పాల్గొనబోతుందట. అదే విధంగా బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరించిన సుడిగాలి సుధీర్ , అమర్ దీప్ చౌదరి వంటి వారు కూడా ఈ షో లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నారట. వీరితో పాటు ప్రముఖ యాంకర్ ప్రదీప్, శివాజీ, యాంకర్ శ్రీముఖి , అనన్య నాగేళ్ల వంటి వారు కూడా ఈ షో లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నారట. ఇక స్టార్ మా ఛానల్ లో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న గుండె నిండా గుడి గంటలు హీరో విష్ణు కాంత్ తో పాటు , ఆ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న అమూల్య కూడా ఈ షో లో కనిపించబోతుంది అట.

అదే విధంగా బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ నిఖిల్, సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల , సీజన్ 5 టైటిల్ విన్నర్ సన్నీ వంటి వారు కూడా ఈ షో లో భాగం కాబోతున్నారట. వీరితో పాటు సినీ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బా పటేల్ లతో పాటు మరికొంతమంది పాపులర్ ఆర్టిస్టులు ఈ షో లో భాగం కానున్నారు. హిందీ లో సంచలన విజయం సాధించిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ని తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. వచ్చే నెలలోనే ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper