Mirai Movie: మన తెలుగు సినిమాకు పరిధులు లేవు. మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది అనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పెద్ద హీరో , చిన్న హీరో అనే తేడానే లేదు. మంచి కంటెంట్ ఉంటే చాలు , మన తెలుగు సినిమాలకు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు లభిస్తోంది. అందుకు బెస్ట్ ఉదాహరణగా నిల్చిన చిత్రం ‘మిరాయ్’. తేజ సజ్జ హీరో గా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాని మరో రెండు రోజుల్లో జపాన్ లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా తేజ సజ్జ ప్రొమోషన్స్ లో కూడా చాలా యాక్టీవ్ గా పాల్గొన్నాడు. ఫలితంగా ఈ చిత్రానికి జపాన్ లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది.
అక్కడి ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ‘ధురంధర్ 2’, ‘టైగర్ జిందా హై’ , బాహుబలి ని మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయట. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం టాప్ 7 ఇండియన్ మూవీస్ లిస్ట్ లోకి చేరిపోయినట్టు తెలుస్తోంది. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 2 వేలకు పైగా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడుపోయాయి అట. మొదటి రోజు 3 మిలియన్ డాలర్లకు పైగా జపనీస్
డాలర్స్ గ్రాస్ ఈ చిత్రానికి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే , తేజ సజ్జ ప్రభాస్ , రామ్ చరణ్, అల్లు అర్జున్ లీగ్ లోకి వెళ్ళిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రానికి ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతాయని బహుశా మిరాయ్ టీం కూడా ఊహించి ఉండదేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం జపాన్ లో ఇంకెన్ని రికార్డ్స్ ని నెలకొల్పబోతుందో చూడాలి. తేజ సజ్జ నటించిన ‘హనుమాన్’ చిత్రానికి కూడా జపాన్ లో భారీ వసూళ్లు వచ్చాయట. ఆ సినిమా కారణంగా ఏర్పడిన ఫేమ్ , ఈ చిత్రానికి బాగా ఉపయోగపడిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక తేజ సజ్జ తదుపరి చిత్రాలకు ఏ రేంజ్ క్రేజ్ ఏర్పడబోతుందో , మిరాయ్ తో ఒక అంచనా కి రావొచ్చు అని అంటున్నారు. ఇకపై ఆయన సినిమాలు జపాన్ లో కూడా విడుదల అవుతాయని అంచనా వేస్తున్నారు.