Homeఎంటర్టైన్మెంట్Siima awards 2026: దుమ్ములేపిన తేజ సజ్జా.. పురస్కారాలు ఇంకా ఎవరికంటే..

Siima awards 2026: దుమ్ములేపిన తేజ సజ్జా.. పురస్కారాలు ఇంకా ఎవరికంటే..

Siima awards 2026: Siima awards: సైమా అవార్డ్స్ 2026(South Indian international movie awards 2026) వేడుక అంబరాన్ని తాకింది. భారతీయ చిత్ర పరిశ్రమలో సైమా అవార్డులను ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఈ అవార్డులను ఉత్తమ నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు.. తెర వెనుక వ్యక్తులకు అందజేస్తుంటారు. తాజాగా సైమా అవార్డుల వేడుక బెంగళూరు నగరంలోని కోరమంగళ స్టేడియంలో అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. ఫరియా అబ్దుల్లా.. నబా నటేష్ […]

Siima awards 2026: Siima awards: సైమా అవార్డ్స్ 2026(South Indian international movie awards 2026) వేడుక అంబరాన్ని తాకింది. భారతీయ చిత్ర పరిశ్రమలో సైమా అవార్డులను ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఈ అవార్డులను ఉత్తమ నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు.. తెర వెనుక వ్యక్తులకు అందజేస్తుంటారు.

తాజాగా సైమా అవార్డుల వేడుక బెంగళూరు నగరంలోని కోరమంగళ స్టేడియంలో అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. ఫరియా అబ్దుల్లా.. నబా నటేష్ తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ఆద్యంతం అద్భుతంగా జరిగింది. పాటలు.. మాటలు.. నృత్యాలతో వేదిక మొత్తం హోరెత్తిపోయింది. దీనికి తోడు స్పాన్సర్ కంపెనీల ప్రతినిధులు కూడా హాజరు కావడంతో.. సైమా అవార్డుల వేడుక అద్భుతంగా సాగిపోయింది.

నటీనటులకు ప్రత్యేకమైన విడిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారి కోసం విలాసవంతమైన వాహనాలను సమకూర్చారు. గతంలో ఈ వేడుకలను దుబాయ్ లాంటి ప్రాంతాలలో నిర్వహించేవారు. ఇప్పుడు బెంగళూరులో నిర్వహించి..సైమా నిర్వాహకులు తమ సత్తా చూపించారు. దక్షిణాదిలోని ప్రముఖ నగరాలలో సైమా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు.

సత్తా చూపించిన తెలుగోడు

సైమా అవార్డుల వేడుక లో తెలుగు నటుడు తేజ సజ్జా సత్తా చూపించాడు. 2022లో జాంబిరెడ్డి సినిమా ద్వారా మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పురస్కారం అందుకున్నాడు. 2025 లో హనుమాన్ సినిమాకు బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్), 2026లో మిరాయ్ సినిమాకు ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. తద్వారా హ్యాట్రిక్ పురస్కారాలు అందుకునే చరిత్ర సృష్టించాడు.

ఉత్తమ నటీమణి కేటగిరీలో ఐశ్వర్య రాజేష్ (సంక్రాంతికి వస్తున్నాం) పురస్కారం అందుకుంది. ఉత్తమ హాస్య నటుడు అవార్డును బుల్లి రాజు అలియాస్ భీమాల రేవంత్ (Sankranti ki vastunnam) పురస్కారం అందుకున్నాడు. కాంతారావు చాప్టర్ 1 లో సూపర్ నటనతో ఆకట్టుకున్న కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab shetty) పురస్కారం అందుకున్నాడు. మిగతా కేటగిరీలలో పురస్కరాలు అందుకున్న వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అవార్డులు అందుకున్నది వీరే

  1. ఉత్తమ నటుడు తేజ సజ్జా(మిరాయ్)
  2. ఉత్తమ నటి ఐశ్వర్య రాజేష్ (సంక్రాంతికి వస్తున్నాం)
  3. ఉత్తమ హాస్య నటుడు బుల్లి రాజు (సంక్రాంతి వస్తున్నాం)
  4. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
  5. బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ సమీరా భరద్వాజ్ (కోర్టు)
  6. బెస్ట్ యాక్ట్రెస్ (ఇంట్రడ్యూసింగ్) సాక్షి మడోల్కర్ (మోగ్లీ)

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper