Korean Kanakaraju: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయం లో హీరో వరుణ్ తేజ్ , హీరోయిన్ రితికా నాయక్ , కమెడియన్ సత్య , డైరెక్టర్ మేర్లపాక గాంధీ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. వరుసగా ఈవెంట్స్ ని నిర్వహించడమే కాకుండా, ఇంటర్వ్యూస్ కూడా నాన్ స్టాప్ గా ఇస్తున్నారు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భీమవరం లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ చాలా హృద్యంగా , అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ , తమన్ లు కలిసి యాంకర్ సుమ ని సన్మానించడం హైలైట్ గా నిల్చింది. ఇది సినిమా ప్రొమోషన్స్ కి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.
మరోపక్క ఈ సినిమాని సోషల్ మీడియా లో కూడా విన్నూత రీతిలో ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. నిన్న తన తోటి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక స్పెషల్ వీడియో ని చేయించాడు వరుణ్ తేజ్. ఆయనలోకి కొరియన్ ఆత్మ దూరినట్టుగా చూపించారు. ఇక నేడు తేజ సజ్జ తో కూడా ఇదే తరహా వీడియో చేయించారు. ఈ రెండు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. వాటిని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ పై వరుణ్ తేజ్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా మీద మాకు అపారమైన నమ్మకం ఉండడం వల్లే, విడుదలకు ఒక రోజు ముందు రాత్రి , అనగా ఆగస్టు 6 రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.
మెగా ఫ్యామిలీ లో నలుగురు స్టార్ హీరోల తర్వాత , వరుణ్ తేజ్ 5 వ స్టార్ హీరో గా నిలుస్తాడని మెగా ఫ్యాన్స్ ఈయన పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కెరీర్ లో ఫిదా , తొలిప్రేమ , f2,f3, గద్దల కొండ గణేష్ వంటి భారీ సూపర్ హిట్స్ ని కూడా అందుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ తర్వాత వరుణ్ తేజ్ నుండి విడుదలైన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. రొటీన్ కమర్షియల్ పద్దతిలో కాకుండా కాస్త డిఫరెంట్ గా జనరంజకంగా తీయలేకపోవడం వల్లే ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ‘కొరియన్ కనకరాజు’ తానూ నమ్మిన కొత్త రకం కాన్సెప్ట్ కి ఎంటర్టైన్మెంట్ ని జోడించి మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు. కనీసం ఈ సినిమాతో అయినా కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
View this post on Instagram
View this post on Instagram