Chiranjeevi : నిన్నటి తరం సూపర్ స్టార్స్ లో చిరంజీవి , నాగార్జున మధ్య ఉన్న స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల కాలం నుండి వీళ్లిద్దరి మధ్య స్నేహం , సొంత అన్నదమ్ములని తలపిస్తూ వచ్చింది. వీళ్లిద్దరికీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వద్ద ఎంత పోరు ఉన్నా , అభిమానులు నిత్యం ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉన్నా, వీళ్ళ మధ్య ఉండే బంధాన్ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. అంతటి సాన్నిహిత్యం ఉన్న వీళ్లిద్దరి కాంబినేషన్ నిన్నటి తరం స్టార్ డైరెక్టర్స్ ఒక్కరు కూడా మల్టీ స్టార్రర్ చిత్రం చెయ్యాలని అనుకోకపోవడం దురదృష్టకరం. కానీ ప్రస్తుత తరం లో మల్టీస్టార్రర్ సినిమాలు అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఒకే తరానికి చెందిన హీరోలు కూడా కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం చూపడం లేదు.
ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లో చిరంజీవి , వెంకటేష్ లను ఒకే ఫ్రేమ్ లో చూసిన ఆడియన్స్ , థియేటర్స్ లో సంబరాలు చేసుకున్నారు. ఇంకా కాసేపు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సన్నివేశాలు ఉండుంటే బాగుండేది అని అందరికీ అనిపించింది. అయితే వెండితెర పై చిరంజీవి , వెంకటేష్ లను ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్ర లో ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చిన ఘనత అనిల్ రావిపూడి కి సొంతమైంది. ఇప్పుడు మరోసారి అనిల్ రావిపూడి అలాంటి అరుదైన ఘనత ని దక్కించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టార్రర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే చిరంజీవి, నాగార్జున కాంబినేషన్ లో ఒక క్రేజీ మల్టీస్టార్రర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి.
ఇప్పటికే ఒక స్టోరీ లైన్ ని కూడా ఫిక్స్ చేసుకున్నాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ , కచ్చితంగా వీళ్ళ కాంబినేషన్ సినిమా తియ్యాలని అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యినట్టు మాత్రం తెలుస్తోంది. అదే కనుక జరిగితే , ఈ క్రేజీ మల్టీస్టార్రర్ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ నే సృష్టించబోతోంది అనుకోవచ్చు. నాగార్జున కి కూడా ఇది తిరుగులేని కం బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.