Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Pre Release Business: తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2' కి 'KGF 2'...

Dhurandhar 2 Pre Release Business: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2’ కి ‘KGF 2’ ని మించిన క్రేజ్..ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతకు జరిగిందంటే!

Dhurandhar 2 Pre Release Business: మన తెలుగు రాష్ట్రంలోని మూవీ లవర్స్, సినిమా బాగుంటే హీరో ఎవరు అనేది చూడరు, ఏ భాషకు సంబంధించిన సినిమా అయినా సరే, కంటెంట్ బాగుంటే నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తారు. ఇలాంటి సినీ అభిమానులు దేశం లో ఎక్కడా కూడా ఉండరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. పక్క రాష్ట్రానికి చెందిన రజినీకాంత్,సూర్య వంటి హీరోలకు ఇక్కడ మన స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్స్ ఇచ్చిన సందర్భాలు […]

Dhurandhar 2 Pre Release Business: మన తెలుగు రాష్ట్రంలోని మూవీ లవర్స్, సినిమా బాగుంటే హీరో ఎవరు అనేది చూడరు, ఏ భాషకు సంబంధించిన సినిమా అయినా సరే, కంటెంట్ బాగుంటే నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తారు. ఇలాంటి సినీ అభిమానులు దేశం లో ఎక్కడా కూడా ఉండరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. పక్క రాష్ట్రానికి చెందిన రజినీకాంత్,సూర్య వంటి హీరోలకు ఇక్కడ మన స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్స్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి చరిత్ర మనది. ఇప్పటికీ అందులో ఎలాంటి మార్పు లేదు. కంటెంట్ బాగుంటే రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యే రేంజ్ ఓపెనింగ్స్, లాంగ్ రన్ ఇస్తారు. కర్ణాటక భాషకు చెందిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కి తెలుగు రాష్ట్రాల నుండి వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, మన తెలుగు ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు అనేది.

అంతెందుకు రీసెంట్ గా విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రాన్నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ చిత్రం అద్భుతంగా ఉందని మొదటి ఆట నుండే టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం హిందీ వెర్షన్ లోనే ఈ సినిమా విడుదలైంది. ఆ హిందీ వెర్షన్ కి తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లు అక్షరాలా 80 కోట్ల రూపాయిలు. సినిమా అంటే మన ఆడియన్స్ ఎంత పిచ్చి అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అందుకే ఈ సినిమా సీక్వెల్ కి మన తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. థియేట్రికల్ వెర్షన్ లో తెలుగు వెర్షన్ రిలీజ్ లేకపోయినా, ఓటీటీ లో మాత్రం తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది. దీనికి మన ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్ లో అయితే హిందీ మరియు ఇతర భాషలకు సంబంధించిన ట్వీట్స్ కంటే, తెలుగు భాషకు సంబంధించిన ట్వీట్స్ కి ఎక్కువ రీచ్ వచ్చింది.

యూత్ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని గమనించిన మన టాలీవుడ్ నిర్మాతలు, తెలుగు వెర్షన్ డబ్బింగ్ రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. చివరికి ఈ తెలుగు వెర్షన్ థియేట్రీకల్ రైట్స్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ కి సొంతం అయ్యినట్టు తెలుస్తోంది. దాదాపుగా 30 కోట్ల రూపాయలకు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేశారట. యావరేజ్ టాక్ వచ్చినా వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మరో ‘కేజీఎఫ్’ సిరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చి 19 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper