spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Contestants Final List: క్వారంటైన్ లో ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు...

Bigg Boss 5 Contestants Final List: క్వారంటైన్ లో ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే

Bigg Boss 5 Contestants Final List

Bigg Boss 5 Contestants Final List: బుల్లితెరపై తెలుగులో నంబర్ 1 రియాలిటీ షో ‘బిగ్ బాస్’.. ఐదో సీజన్ కు తాజాగా వేళైంది. ఈ బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. దేశంలోని అన్ని భాష‌ల్లోనూ స‌క్సెస్ అయిన ఈ రియాలిటీ షో.. తెలుగులో అన్నింటికంటే కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. మిగిలిన ఇండ‌స్ట్రీల్లో సాగుతున్న ‘బిగ్ బాస్’ షోలతో కంపేర్ చేస్తే.. తెలుగు షోనే ఎక్కువగా రేటింగ్ సాధించింది. అంతలా ప్రేక్షకులను ఆక‌ర్షించిన ఈ షో.. టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. 5వ సీజ‌న్ కు రెడీ అవుతోంది. క‌రోనా లేక‌పోతే ఇప్ప‌టికే స్టార్ట్ కావాల్సిన ఈ షో.. వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. సెప్టెంబ‌ర్ 5వ తేదీన సీజ‌న్‌ ప్రారంభించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇటీవలే స్టార్ మాటీవీ ప్రోమోలను విడుదల చేసింది.

ఇప్ప‌టికే సెట్ నిర్మాణం పూర్తయ్యింది. కంటిస్టెంట్ల సెల‌క్ష‌న్ కూడా పూర్తయ్యి వారిని క్వారంటైన్లోకి పంపారు. క్వారంటైన్ లో ఎవ‌ర‌ున్న‌దానిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక అంచ‌నాకు సైతం జ‌నాలు రాలేక‌పోతున్నారు.

. నాలుగో సీజ‌న్ కంటిస్టెంట్ల ఎంపిక‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. మిగిలిన వారంతా ఎవ‌రో తెలియ‌దని, అలాంటి వారిని తీసుకొచ్చి పెట్టార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. సెల‌బ్రిటీ గేమ్ షో మాదిరిగా లేద‌ని కూడా అన్నారు. దీన్ని బ‌ట్టి ఈ సారి కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది.అందుకే సెలబ్రెటీలకే ఈసారి పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది.

కరోనా థర్డ్ వేవ్ సూచనల నేపథ్యంలో ఈసారి సెప్టెంబర్ 5న ఖచ్చితంగా సీజన్ ను పట్టాలెక్కించాలని స్టార్ మా పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. దీనికోసం చాలా గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా కంటెస్టెంట్లు అందరూ క్వారంటైన్ లో ఉన్నారని.. వారిని డైరెక్టుగా హౌస్ లోకి పంపిస్తారని అంటున్నారు. తాజాగా కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పేర్లు బయటకు వచ్చాయి.

-బిగ్ బాస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి సందడి చేసే కంటెస్టెంట్లు వీరేనని సమాచారం.
1. యాంకర్ రవి
2.యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్
3. టీవీ నటి నవ్యస్వామి
4. ఆర్జే కాజల్
5. కమెడియన్ లోబో
6. టీవీ నటి సిరి హన్మంతు
7. సీనియర్ నటి ప్రియ
8.కార్తీక దీపం ఫేమ్ ఉమ
9. యూట్యూబర్ సరయు
10.టీవీ నటుడు మానస్
11.మోడల్ జస్వంత్
12. టీవీ నటుడు సన్నీ
13.కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్
14.ఆర్జే ప్రియాంక (ట్రాన్స్ జెండర్)
15.టీవీ9 యాంకర్ ప్రత్యూష
16. కొరియో గ్రాఫర్ ఆట సందీప్ లేదా రఘు మాస్టర్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper