YSRCP: ఏపీలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిస్తామని.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూటమి ఈవీఎం లను మేనేజ్ చేసి గెలిచిందని.. వైసిపి ఆరోపించింది. స్థానిక ఎన్నికల్లో కూటమికి చుక్కలు చూపిస్తామని హెచ్చరించింది. జగన్ అయితే బస్తీ సవాల్ అంటూ హెచ్చరికలు పంపారు. కానీ స్థానిక ఎన్నికల్లో వైసిపి తేలిపోయింది. జగన్ హెచ్చరించినట్టుగా కూటమికి బలమైన పోటీ ఇవ్వలేకపోయింది. అక్కడిదాకా ఎందుకు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ప్రాంతంలో చేతులెత్తేసింది. తొలిసారిగా ఇక్కడ పసుపు జెండా ఎగిరింది. టిడిపి అభ్యర్థి పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. సొంత పిన్నిని జగన్ గెలిపించుకోలేకపోయారు.
వైసిపి ఓటమికి రకరకాల కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో జగన్ స్వయంకృతాపరాధం.. పార్టీని సరిగా పట్టించుకోకపోవడం. కొంతమంది నాయకుల వ్యవహారశైలి కారణమని చెబుతున్నారు. కానీ వైసీపీ ఓటమికి జగన్ కారణం కాదు.. మిగతా నాయకులు అంతకంటే కాదు. ఈ మాట చెబుతున్నది ఎవరో కాదు.. శ్రీ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ ఫ్యాన్.. ఒకప్పుడు వైసిపికి పనిచేసిన ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. కాకపోతే పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆమె అప్పుడప్పుడు బయటపెడుతోంది. ఒకప్పుడు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్.. చంద్రబాబు.. నారా లోకేష్ ను తీవ్రంగా విమర్శించేది శ్రీరెడ్డి. అధికారం కోల్పోయిన తర్వాత.. జగన్ పార్టీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన తర్వాత.. శ్రీ రెడ్డికి జ్ఞానోదయం అయింది. ఆ తర్వాత ఆమె పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాలను.. పార్టీ తనకు చేసిన అన్యాయాలను బయట పెట్టడం మొదలుపెట్టింది.
శ్యామల వైసిపి అధికార ప్రతినిధి కావడం శ్రీరెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్లే ఆమె శ్యామల మీద వ్యక్తిగత దాడి మొదలుపెట్టింది. ఇక తాజా స్థానిక ఎన్నికల్లో ఓటమికి శ్యామల కారణమని శ్రీరెడ్డి ఆరోపించింది.. ఆమె కాలు మహత్యమని.. ఆమె అడుగు పెట్టిన చోట పార్టీ పరిస్థితి ఇలానే ఉంటుందని ఆరోపించింది. వాస్తవానికి శ్యామల స్థానంలో గతంలో శ్రీరెడ్డి అనధికారికంగా కొనసాగుతూ ఉండేది. పార్టీ నాయకులతో ఆమెకు బలమైన సంబంధాలు ఉండేవి. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. శ్రీ రెడ్డికి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇదే సమయంలో శ్యామలకు ప్రయారిటీ పెరిగిపోయింది. పైగా అధికారిక సమావేశాలలో శ్యామల మాట్లాడడం ఎక్కువైపోయింది. దీనిని శ్రీరెడ్డి జీర్ణించుకోలేకపోయింది. అందువల్లే శ్యామల మీద ఈ స్థాయిలో ఆమె విమర్శలు చేస్తోంది.
శ్యామల మీద శ్రీ రెడ్డి ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఇంతవరకు శ్యామల స్పందించలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.. ఆ మధ్య శ్యామలకు ప్రయారిటీ తగ్గించినట్టు వార్తలు వచ్చాయి.. కొద్దిరోజుల పాటు ఆమె తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లలేదని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు.. మళ్లీ శ్యామల పొలిటికల్ గా యాక్టీవ్ అయిపోయారు. పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు.