Homeఆంధ్రప్రదేశ్‌Jagan Mohan Reddy: వీక్లీ పొలిటికల్ క్యాలెండర్.. జగన్ పదేపదే అదే రాగం..

Jagan Mohan Reddy: వీక్లీ పొలిటికల్ క్యాలెండర్.. జగన్ పదేపదే అదే రాగం..

Jagan Mohan Reddy: వైసీపీ అధినేత జగన్ వీక్లీ పొలిటికల్ క్యాలెండర్ అమలు చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పాడిన పాట మళ్ళీ మళ్లీ పాడారు. అందులో కొత్తరాగం లేదు. కొత్త తాళం అంతకంటే లేదు. ఏదో చెప్పుకుంటూ పోయారు. అందులో తర్కం లేదు. వివరం అంతకంటే లేదు. పురపాలక ఎన్నికల్లో పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పటికే వైసీపీ స్థాయి ఏమిటో నిరూపించింది. గురువారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా […]

Jagan Mohan Reddy: వైసీపీ అధినేత జగన్ వీక్లీ పొలిటికల్ క్యాలెండర్ అమలు చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పాడిన పాట మళ్ళీ మళ్లీ పాడారు. అందులో కొత్తరాగం లేదు. కొత్త తాళం అంతకంటే లేదు. ఏదో చెప్పుకుంటూ పోయారు. అందులో తర్కం లేదు. వివరం అంతకంటే లేదు.

పురపాలక ఎన్నికల్లో పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పటికే వైసీపీ స్థాయి ఏమిటో నిరూపించింది. గురువారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ.. జెడ్ పి టి సి పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్లో హింసాత్మక ఘటనలు ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో జరిగాయి. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో బాంబుదాడులు కూడా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో జగన్ మాటలు మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. అయితే ప్రజల ఆసక్తిని ఆదుకోవడంలో జగన్ ఈసారి కూడా విఫలమయ్యారు.

ప్రతిసారి బాధితుడి మాదిరిగా మాట్లాడటం జగన్ కు అలవాటుగా మారిపోయింది. పైగా అందులో శోకాలు.. కన్నీటి రాగాలు అలవాటైపోయాయి. పురపాలక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ తన విలేకరుల సమావేశంలో చెప్పలేదు. చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. పైగా పురపాలక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మీద బురద చల్లడానికి ప్రయత్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగడం లేదని.. ఎంపికలు మాత్రమే జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. పైగా వ్యవస్థలను పూర్తిగా తప్పు పట్టారు ప్రభుత్వం పూర్తిగా మేనేజ్ చేస్తూ ఉందంటూ సాకులు చెప్పారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్లు కూడా వేయనీయలేదు. బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. అరాచకం అనే పదానికి అసలు సిసలైన అర్ధాన్ని చెప్పారు. ఇప్పుడు పారదర్శకంగా బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంటే.. సెలక్షన్లు అంటూ ఆరోపించారు.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 31 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలలో లక్షల మంది ఓటర్లు తమ హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాలలో జరిగిన ఘటనలను జగన్ అనుకూల మీడియా త్రీడీలో చూపించే ప్రయత్నం చేసింది. ఏజెంట్ల మధ్య జరిగిన తోపులాటను.. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింస లాగా చిత్రీకరించింది. అసలు పోలీసులు లేరని.. శాంతిభద్రతలు లేవని.. కార్యకర్తలను హింసిస్తున్నారని.. ఆరోపించడం మొదలుపెట్టింది వైసిపి. ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ.. దానిని పూర్తిగా పక్కదారి పట్టించడానికి స్థానికంగా ఉన్న గొడవలను జాతీయస్థాయి లెవెల్ లో సమస్యలుగా చిత్రీకరించింది.

జగన్ పార్టీకి ఈ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని అర్థమవుతూనే ఉంది. అందువల్లే దానిని ఎన్నికల సంఘం మీద.. పోలీసుల మీద.. బ్యాలెట్ పేపర్ల మీద నెట్టి వేయడానికి జగన్ ముందస్తు ఎత్తుగడ ఈ విధంగా రూపొందించుకున్నారు. క్యాడర్ మొత్తం నిరాశలో ఉన్న నేపథ్యంలో వారికి దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత జగన్ మీద ఉంది. కానీ ఆ విషయాన్ని పక్కనపెట్టి బెదిరింపులకు పాల్పడటం.. బాధిత రాగం అందుకోవడం.. జగన్ కే చెల్లిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper