Homeఎంటర్టైన్మెంట్Tollywood Young Hero: పెళ్లి అయ్యింది..కానీ పెళ్లి కానట్టు నటిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో..అడ్డంగా దొరికిపోయాడుగా!

Tollywood Young Hero: పెళ్లి అయ్యింది..కానీ పెళ్లి కానట్టు నటిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో..అడ్డంగా దొరికిపోయాడుగా!

Tollywood Young Hero: కొంతమంది హీరోలు మన టాలీవుడ్ లో వెండితెర పై నటించడమే కాదు, నిజ జీవితంలో కూడా తెగ నటించేస్తున్నారు. కానీ వాళ్ళు నటిస్తున్న విషయం జనాలకు అర్థం అయిపోతుంది. ఉదాహరణకు విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ వ్యవహారాన్ని తీసుకుందాం. వీళ్లిద్దరు చాలా కాలం నుండి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. వాళ్ళిద్దరికీ కూడా తమ ప్రేమ […]

Tollywood Young Hero: కొంతమంది హీరోలు మన టాలీవుడ్ లో వెండితెర పై నటించడమే కాదు, నిజ జీవితంలో కూడా తెగ నటించేస్తున్నారు. కానీ వాళ్ళు నటిస్తున్న విషయం జనాలకు అర్థం అయిపోతుంది. ఉదాహరణకు విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ వ్యవహారాన్ని తీసుకుందాం. వీళ్లిద్దరు చాలా కాలం నుండి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. వాళ్ళిద్దరికీ కూడా తమ ప్రేమ విషయం జనాలకు తెలుసు అనేది అర్థం అయ్యింది. అయినప్పటికీ వీళ్ళు తమ మధ్య ఏమి లేనట్టే బయటకు నటిస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కాదు. ఇదే తరహాలో అప్పట్లో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జంటలు, అదే విధంగా బాలీవుడ్ లో కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా జంటలు పెళ్లికి ముందు నటనలో జీవించేవారు, కానీ చివరికి వాళ్ళు పెళ్లి చేసుకొని అందరినీ షాక్ కి గురి చేశారు.

ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన ఒక యంగ్ హీరో కూడా ఇలాగే నటనలో జీవించేస్తున్నాడు అట. యంగ్ హీరో అంటే ఆయనకు 20 ఏళ్ళు ఏమో అని అనుకోకండి, 30 ఏళ్ళ వయస్సు ఉంది. ఇతనికి పెళ్లి జరిగి చాలా కాలమే అయ్యిందట. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన తన భార్య తో కలిసి తిరుగుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. కానీ ఇప్పటికీ మీడియా ముందు నాకింకా పెళ్లి కాలేదు, నేను సింగిల్ గానే ఉంటున్నాను అని చెప్పుకొని తిరుగుతున్నాడు అట. ఇంతకీ ఎవరు ఆ హీరో?, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయిన సోషల్ మీడియా లో వచ్చిన ఈ చిన్న క్లూని ఆధారంగా తీసుకొని నెటిజెన్స్ కొందరి హీరోల పేర్లను చెప్తున్నారు.

రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో హీరో నవీన్ పోలిశెట్టి ని ఒక యాంకర్ మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ప్రశ్నించగా, సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా చేసుకుంటా అంటూ సెటైరికల్ గా సమాధానం చెప్తాడు. పైన చెప్పిన క్లూలను ఆధారంగా తీసుకుంటే ఈ హీరో గురించే ఆ న్యూస్ వచ్చిందని అనుకోవచ్చు. నవీన్ పోలిశెట్టి కాకుండా సందీప్ కిషన్, రామ్ పోతినేని వంటి వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. మీరేమి అనుకుంటున్నారు?, ఏ హీరో అయ్యుంటాడు? అనేది కామెంట్స్ రూపం లో మీ అంచనాలను తెలియజేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper