Tamannaah Mysore Sandel Soap: కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక మైసూర్ శాండల్ సబ్బుకు తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దీంతో స్థానిక హీరోయిన్లు రశ్మిక, శ్రీనిధి శెట్టి సహా పలువురి అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రఖ్యాత మైసూరు శాండల్ సబ్బుకు టాలీవుడ్ నటి తమన్నా ను నియమించడం కర్ణాటకలో దుమారం రేపుతుంది.