IPL Playoff : ఈ నాలుగు జట్లు కూడా సమఉజ్జీలు కావడంతో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇక పాయింట్లు పట్టికలో తొలి రెండు స్థానాలలో నిలవడానికి ఈ జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడి దాకా వచ్చిన జట్లు క్వాలిఫైయర్ లో ఓడిపోతే ఇంకో అవకాశం ఉంటుంది. టేబుల్ లాస్ట్ ప్లేస్ లో ఉన్న జట్లు టాప్ -2 పై ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో సమీకరణాలు అత్యంత ఉత్కంఠ గా మారిపోయాయి.
గుజరాత్ టైటాన్స్
గుజరాత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ జట్టుకు లక్నో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఫలితంగా గుజరాత్ టాప్ -2 అవకాశం ఒకసారి గా కష్టతరంగా మారింది. గుజరాత్ ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాలి. ఒకవేళ అందులో గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 20 పాయింట్లు మాత్రమే ఉంటాయి.. అప్పుడు గుజరాత్ టాప్ -2 లోకి వెళ్తుందా? లేదా? అనే విషయాలను బెంగళూరు, పంజాబ్ జట్లు డిసైడ్ చేస్తాయి. ఇక లాస్ట్ ప్లేస్ లో ఉన్న చెన్నై తను ఆడే చివరి మ్యాచ్లో గుజరాత్ తో తలపడుతుంది. ఆ మ్యాచ్ లో కనుక గుజరాత్ కు చెన్నై దిమ్మతిరిగే ఫలితం గనుక ఇస్తే గిల్ బృందం మూడో స్థానానికి పడిపోవాల్సి ఉంటుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
17 పాయింట్లు బెంగళూరు ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది. ఇంకా ఈ జట్టు రెండు మ్యాచ్లు ఆడాలి. హైదరాబాద్, లక్నోతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్లు కనుక గెలిస్తే బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుంది. ఒకవేళ హైదరాబాద్, లక్నో గనక దిమ్మతిరిగే ఫలితం ఇస్తే బెంగళూరు పరిస్థితి దారుణంగా ఉంటుంది. అప్పుడు ఆ జట్టు టాప్ -2 ప్లేస్ గల్లంతవుతుంది. ఇప్పటికే లక్నో జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలను హైదరాబాద్ అందనంత దూరం చేసి పడేసింది. ఇక లక్నో కూడా గురువారం గుజరాత్ కు చుక్కలు చూపించింది.. అలాంటప్పుడు బెంగళూరు – హైదరాబాద్ మధ్య జరిగే పోటీలో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాల్సి ఉంది.
పంజాబ్..
ఆల్మోస్ట్ 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. పంజాబ్ ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్టు థర్డ్ ప్లేస్ లో ఉంది. ఢిల్లీ, ముంబై తో తదుపరి మ్యాచ్లలో తలపడాలి. ఒకవేళ ఇరనెట్లో గెలిస్తే 21 పాయింట్లతో పంజాబ్ టాప్ -2లోకి వెళుతుంది. ఒకవేళ ఒక మ్యాచ్ లో గనక ఓడిపోతే మిగతా జట్ల ఫలితాలపై పంజాబ్ టాప్ -2 స్థానం ఆధారపడి ఉంటుంది.
ముంబై
ముంబై జట్టు ఒక మ్యాచ్ మాత్రమే ఆడాలి. అది కూడా పంజాబ్ జట్టుతో తలపడాలి. పంజాబ్ జట్టు చేతుల ఓడిపోతే హార్దిక్ పాండ్యా బృందం నాలుగో ప్లేస్ కు పడిపోతుంది. పంజాబ్ పై గెలిచినప్పటికీ ముంబై ఎకౌంట్లో 18 పాయింట్లు మాత్రం ఉంటాయి. అప్పుడు టాప్ -2 లోకి హార్దిక్ సేన రావాలి అంటే మిగతా టీములు రాబోయే అన్ని మ్యాచ్లు ఓడిపోవాలి..
ఇక ప్రస్తుత సమీకరణాల ప్రకారం చూస్తే చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, లక్నో ఎలిమినేట్ అయిపోయాయి. ఈ జట్లు తమ చివరి మ్యాచులలో దూకుడుగా ఆడే అవకాశం ఉంది. ఒకవేళ గనుక ఇవి విజయాల సాధిస్తే ప్లే ఆఫ్ వెళ్లిపోయిన జట్లకు ఇబ్బందులు ఎదురుకోక తప్పదు. మొత్తంగా ప్రతి మ్యాచ్ ఫలితం, నెట్ రన్ రేట్.. ఇవన్నీ కూడా ఆ నాలుగు జట్లకు అత్యంత ముఖ్యంగా మారిపోయాయి.