Homeఎంటర్టైన్మెంట్Jayam Ravi: అప్పుల్లో ముంచి వెళ్లిపోయాడంటూ మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో అత్త..

Jayam Ravi: అప్పుల్లో ముంచి వెళ్లిపోయాడంటూ మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో అత్త..

Jayam Ravi: తమిళ స్టార్ హీరో రవి మోహన్ విడాకుల వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన భార్య ఆర్తి విడాకులు ఇవ్వకుండా, మానసికంగా టార్చర్ కి గురి చేస్తుందని , నాకు ఇష్టమైన వాళ్ళను కూడా దూరం చేస్తుందని , కనీసం నా పిల్లల్ని కూడా కలవనివ్వడం లేదని , ఆమెతో విడాకులు జరిగేంత వరకు నేను హీరో గా నటించిన సినిమాలను విడుదల చేయబోను అంటూ మీడియా ముందుకొచ్చి కంటతడి […]

Jayam Ravi: తమిళ స్టార్ హీరో రవి మోహన్ విడాకుల వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన భార్య ఆర్తి విడాకులు ఇవ్వకుండా, మానసికంగా టార్చర్ కి గురి చేస్తుందని , నాకు ఇష్టమైన వాళ్ళను కూడా దూరం చేస్తుందని , కనీసం నా పిల్లల్ని కూడా కలవనివ్వడం లేదని , ఆమెతో విడాకులు జరిగేంత వరకు నేను హీరో గా నటించిన సినిమాలను విడుదల చేయబోను అంటూ మీడియా ముందుకొచ్చి కంటతడి పెట్టుకున్న ఘటన యావత్తు తమిళనాడు ప్రజలను శోకసంద్రం లోకి నెట్టేసింది. అయితే రీసెంట్ గానే రవి మోహన్ సతీమణి విడాకులు ఇవ్వాలంటే నెలకు 40 లక్షల రూపాయిల భరణం ఇవ్వాలంటూ పెట్టిన పిటీషన్ ని కొట్టిపారేసిన సంగతి అందరికీ తెలిసిందే. రవి మోహన్ కి ఎట్టకేలకు విముక్తి కలిగింది , ఇకపై ఆయన సంతోషంగా ఉంటాడని అభిమానులు ఆనందించారు.

అయితే ఇంతలోపే రవి మోహన్ అత్త సుజాత విజయ్ కుమార్ మీడియా ముందుకొచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘ఆర్తి విడాకుల కోసం నెలకు 40 లక్షల రూపాయిల భరణం అడిగింది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. రవి మోహన్ వల్ల మేము చాలా అప్పులకు గురయ్యాము. ఇంటిపై రీసెంట్ గానే బ్యాంక్ జప్తు నోటీసు కూడా జారీ అయ్యింది. పిల్లల స్కూల్ ఫీజులు , ట్యూషన్ , ఆహరం ఖర్చులను మేము భరించలేకపోతున్నాము. ఈ విషయం లో మేము పిటీషన్ వేస్తే , రవి మోహన్ కి కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం అతని పిల్లలు అమెరికన్ స్కూల్ లో చదువుతున్నారు. ఏడాదికి 86 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది రవి మోహనే భరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆర్తి కి నెలకు 3 లక్షలు , కొడుకు ఆరవ , అయాన్ లకు చెరొక లక్ష రూపాయిలు నెలకు చెల్లించాలని కోర్టు రవిని ఆదేశించింది. అంతే కాకుండా పిల్లల భవిష్యత్తు పోషణ , ఉన్నత విద్య విషయం లో కూడా రవి మోహన్ బాధ్యతలు చేపట్టాలని స్పష్టంగా కోర్టు తెలిపింది’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘మేమెప్పుడూ రవిని పిల్లతో కలవకుండా చెయ్యలేదు. గత రెండేళ్లుగా మేము రవి , ఆర్తి లను కలిపేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కోర్టు కూడా ఎట్టి పరిస్థితిలోనూ తండ్రి – పిల్ల్లలు కలుసుకునేలా ఆదేశాలు ఇచ్చింది. గతం లో ఈ మీటింగ్స్ కి ఒక హీలేర్ సమక్షం లో జరగాలనే రూల్ ఉండేది. దాని వాళ్ళ పిల్లలిద్దరూ అసౌకర్యానికి గురయ్యారు. ఆ కారణం చేతనే వాళ్ళు రవి ని కలవడానికి రాలేదు. మేమే కాదు , ఏ తల్లి కూడా తన బిడ్డలను తండ్రికి దూరం చెయ్యాలని అనుకోదు. కనీసం ఈ నెల నుండి అయినా కుటుంబం లో పరిస్థితులు మెరుగుపడతాయని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper