Homeఎంటర్టైన్మెంట్Suriya Karuppu Movie: 'కరుప్పు' కోసం భారీ లోన్స్.. జ్యోతిక ధైర్యం చేయకుంటే ఇలా ఉండేవాడిని...

Suriya Karuppu Movie: ‘కరుప్పు’ కోసం భారీ లోన్స్.. జ్యోతిక ధైర్యం చేయకుంటే ఇలా ఉండేవాడిని కాదు : హీరో సూర్య

Suriya Karuppu Movie: ఈ ఏడాది ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కం బ్యాక్ ఇచ్చిన హీరో సూర్య. ఆయన చివరిసారిగా సూపర్ హిట్ ని అందుకున్న చిత్రం ఏది అంటే, అభిమానులు కూడా టక్కుమని చెప్పలేని పరిస్థితి. దాదాపుగా 12 ఏళ్ళు దాటింది. ఇక సూర్య నుండి సూపర్ హిట్ రావడం అసాధ్యమే అని అభిమానులు సైతం ఆశలు వదిలేసుకున్న సమయం లో విడుదలైన ‘కరుప్పు’ చిత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో సెన్సేషనల్ బ్లాక్ […]

Suriya Karuppu Movie: ఈ ఏడాది ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కం బ్యాక్ ఇచ్చిన హీరో సూర్య. ఆయన చివరిసారిగా సూపర్ హిట్ ని అందుకున్న చిత్రం ఏది అంటే, అభిమానులు కూడా టక్కుమని చెప్పలేని పరిస్థితి. దాదాపుగా 12 ఏళ్ళు దాటింది. ఇక సూర్య నుండి సూపర్ హిట్ రావడం అసాధ్యమే అని అభిమానులు సైతం ఆశలు వదిలేసుకున్న సమయం లో విడుదలైన ‘కరుప్పు’ చిత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు ఈ చిత్రం ట్రేడ్ ని చాలా సర్ప్రైజ్ కి గురి చేసింది. అన్ని భాషలకు కలిపి దాదాపుగా 340 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి , సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ కం బ్యాక్స్ లో ఒకటిగా నిలిచేలా చేసింది ఈ చిత్రం.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో ఎదురైన కొన్ని సవాళ్ల గురించి రీసెంట్ గానే చెప్పుకొచ్చాడు సూర్య. ఆయన మాట్లాడుతూ ‘కరుప్పు మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు కొన్ని ఆర్ధిక పరమైన పంపిణీ సమస్యలు ఎదురయ్యాయి. ఆ సమయం లో ఈ సినిమా విడుదల కోసం అదనంగా కొన్ని లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే మా కుటుంబం మొత్తానికి ఇది పెద్ద రిస్క్. కానీ నా సతీమణి జ్యోతిక నాపై ఉంచిన నమ్మకం కారణంగానే నన్ను ధైర్యం గా ముందడుగు వేసేలా చేసింది. అలాంటి రిస్క్ తీసుకునేటప్పుడు , ఆమె నాకు కొండంత అండగా నిల్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. సూర్య మాట్లాడిన ఈ మాటలకు జ్యోతిక స్పందిస్తూ ‘నేను ఈ ప్రశంసను స్వీకరించను, మేమిద్దరం ఏ నిర్ణయమైనా కలిసే తీసుకుంటాం. మా పిల్లల పెంపకం విషయం లో కూడా మేమిద్దరం ఒకే అభిప్రాయంతో ఉంటాము’ అంటూ చెప్పుకొచ్చింది జ్యోతిక.

ఇక కరుప్పు గురించి సూర్య మరిన్ని విషయాలు చెప్తూ ‘ డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఈ సినిమా కోసం దాదాపుగా రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ సినిమా విజయం ఎంతో మంది జీవితాలను మార్చేసింది. కష్టమైన సమయం లో మా ఫైనాన్షియర్స్ కూడా బాగా సహకరించారు’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆయన నుండి విడుదల కాబోతున్న చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించాడు. ఈ నెల 14 వ తేదీన అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper