Suriya-Jyothika: తమిళ స్టార్ హీరో సూర్య , జ్యోతిక జంట పెళ్లి జరిగి ఈ నెల 11 తో 20 ఏళ్ళు పూర్తి అయ్యింది. సరిగ్గా 2006 వ సంవత్సరం లో వీళ్లిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహమహోత్సవానికి తమిళ సినిమా ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులూ , మంత్రులు , ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు , పారిశ్రామిక వేత్తలు, ఇలా అన్ని రంగాలకు చెందిన వారు ముఖ్య అతిధులుగా హాజరై సూర్య , జ్యోతిక లను ఆశీర్వదించారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. వీళ్లిద్దరు కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం ‘పూవెళ్ళం కెట్టుప్పర్’. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలా సినిమాల ద్వారా వీళ్ళ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ గా మారి పెళ్లి పీటలు ఎక్కేలా చేసింది.
వీళ్లిద్దరికీ దియా , దేవ్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీళ్లంతా కలిసి సూర్య, జ్యోతిక 20 ఏళ్ళ దాంపత్య జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు చెన్నై లో గ్రాండ్ గా ఒక వేడుక ని ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు సంబంధించిన వీడియో ని నిన్న సూర్య తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడుదల చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మీ ఇద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉంది, వైవాహిక జీవితాలకు విలువ లేకుండా పోతున్నటువంటి ఈరోజుల్లో , రెండు దశాబ్దాలు దాటినా చెక్కు చెదరని బంధం గా ప్రపంచానికి చూపిస్తూ , ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరి 20 ఏళ్ళ దాంపత్య జీవిత సంబరాలకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
ఇకపోతే ఈ ఏడాది సూర్య కి గోల్డెన్ ఇయర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. గత పదేళ్ల నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య, ఈ ఏడాది ‘కరుప్పు’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని ఏకంగా 340 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడు. ఈ సినిమా విడుదలైన మూడు నెలలకే ‘విశ్వనాధ్ & సన్స్’ తో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని , అభిమానులను ఖుషి చేసాడు. ఇక ఈ దీపావళి కి ఆయన ‘సీన్ ‘ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కూడా హిట్ అయితే సూర్య కి ఇక తిరుగు ఉండదు. మరి సూర్య సక్సెస్ స్ట్రీక్ ని ఈ సినిమా ముందుకు తీసుకెళ్తుందా లేదా అనేది చూడాలి.
View this post on Instagram