Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya: హమ్మయ్యా.. హార్దికూ.. ఇప్పటికైనా పెళ్లి చేసుకొని రెండో ఇంటివాడివి అవుతున్నావ్.. ఇక...

Hardik Pandya: హమ్మయ్యా.. హార్దికూ.. ఇప్పటికైనా పెళ్లి చేసుకొని రెండో ఇంటివాడివి అవుతున్నావ్.. ఇక ఆట మొదలుపెట్టు

Hardik Pandya: హార్దిక్ పాండ్యా.. మామూలు ఆటగాడు కాదు.. మైదానంలో ఆడుతాడు. మైదానం వెలుపల అదే స్థాయిలో రెచ్చిపోతాడు. అతడి గర్ల్ ఫ్రెండ్స్ చిట్టా తీస్తే చాంతాడంత ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మనోడు రసిక రాజా. ఏ ముహూర్తంలో కనెక్ట్ అయ్యాడో తెలియదు కానీ ఓ ఫారిన్ నటాషాకు కనెక్ట్ అయిపోయాడు. ఇద్దరు చాలా ఏళ్లపాటు కలిసి తిరిగారు. పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత […]

Hardik Pandya: హార్దిక్ పాండ్యా.. మామూలు ఆటగాడు కాదు.. మైదానంలో ఆడుతాడు. మైదానం వెలుపల అదే స్థాయిలో రెచ్చిపోతాడు. అతడి గర్ల్ ఫ్రెండ్స్ చిట్టా తీస్తే చాంతాడంత ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మనోడు రసిక రాజా.

ఏ ముహూర్తంలో కనెక్ట్ అయ్యాడో తెలియదు కానీ ఓ ఫారిన్ నటాషాకు కనెక్ట్ అయిపోయాడు. ఇద్దరు చాలా ఏళ్లపాటు కలిసి తిరిగారు. పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత వారిద్దరి మధ్య కొద్ది రోజులపాటు బలమైన బంధం కొనసాగింది. ఆ తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆమెకు భరణం భారీగానే చెల్లించాడు.

ఇప్పుడు హార్దిక్ పాండ్యా మహిక శర్మ అనే అమ్మాయితో పీకల లోతు కాదు అంతకంటే ఎక్కువ రిలేషన్ లో ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె లేకుండా అతడు ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవల ఇద్దరు కలిసి తిరుపతి వెళ్లొచ్చారు. ప్రస్తుతానికి మనోడు బెంగళూరులో ఉన్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో చోటు లక్ష్యంగా మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అతని గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ స్పోర్ట్స్ సర్కిల్ లో విపరీతంగా ప్రచారంలో ఉంది.

హార్దిక్ పాండ్యా త్వరలోనే మహిక శర్మను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా బెంగళూరులోనే.. బెంగళూరులో ఒక విలాసవంతమైన ప్యాలెస్ అతడు అద్దెకు తీసుకున్నాడు. అందులోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో అతడు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మహిక శర్మతో తన రిలేషన్ గత ఏడాదే హార్దిక్ పాండ్యా కన్ఫామ్ చేశాడు. వీరిద్దరూ జంట పక్షుల్లాగా ఇప్పటికే చాలా దేశాలు తిరిగివచ్చారు. ఇప్పుడు బెంగళూరులో కలిసే ఉంటున్నారు. హార్దిక్ పాండ్యా గతం మొత్తం మహిక శర్మకు తెలుసు. పైగా ఆమె ఒక మోడల్ కూడా. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలుసు కాబట్టి త్వరలోనే జంటగా మారబోతున్నారని.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఇంతవరకు హార్థిక్ పాండ్యా టీం ఖండించలేదు. అంటే దీనిని బట్టి త్వరలో మనోడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ఒక క్లారిటీ వచ్చేసింది. హార్దిక్ పాండ్యా రెండవ పెళ్లి గురించి విపరీతంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో అతడి అభిమానులు ముందస్తుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైవాహిక జీవితం బాగుండాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper